Health Department | మాతాశిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణకు జాతీయ గుర్తింపు.. కేంద్రం నుంచి రూ.200 కోట్ల అదనంగా నిధులు..!
Health Department | మాతా-శిశు ఆరోగ్య సేవల అమలులో తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ పనితీరును అభినందించిన కేంద్ర ప్రభుత్వం, మాతా-శిశు ఆరోగ్య సేవల బలోపేతానికి తెలంగాణకు రూ.200 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది.
Health Department | మాతా-శిశు ఆరోగ్య సేవల అమలులో తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ పనితీరును అభినందించిన కేంద్ర ప్రభుత్వం, మాతా-శిశు ఆరోగ్య సేవల బలోపేతానికి తెలంగాణకు రూ.200 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మాతా-శిశు ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కేంద్రం నుంచి వచ్చిన ఈ గుర్తింపు గర్వకారణమని ప్రభుత్వం పేర్కొంది. ఈ విజయానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమిష్టి కృషే కారణమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.
ప్రతి గర్భిణికి, ప్రతి తల్లికి, ప్రతి నవజాత శిశువుకు అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్రం మంజూరు చేసిన ఈ ప్రోత్సాహక నిధులతో మాతృ మరణాలు, నవజాత శిశు మరణాల రేటును మరింత తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన మాతా-శిశు ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయని పేర్కొన్నారు. మాతా-శిశు ఆరోగ్య సేవల విషయంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా వైద్యారోగ్యశాఖ పని చేస్తుందని, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bombay High Court | రెండు పురుగులు కనిపించినంత మాత్రాన లైసెన్స్ రద్దు చేస్తారా..? ఎఫ్డీఏ చర్యలను తప్పుబట్టిన బాంబే హైకోర్టు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో ఆటో షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Bhagyashri Borse | నేను హీరోయిన్ కావడం మా అమ్మకు ఇష్టం లేదు - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్
- ●CM Revanth Reddy | నేనేందుకు రాజీనామా చేయాలి.. 2034 వరకు నేనే సీఎం
- ●Flipkart Pay Later | అకౌంట్లో డబ్బులు లేకున్నా ఫ్లిప్కార్ట్లో వస్తువులను కొనవచ్చు.. పే లేటర్ సర్వీస్ లాంచ్..
- ●KTR | ఫార్ములా ఈ-కారు రేసు కేసు.. రేపు కోర్టుకు కేటీఆర్

Bombay High Court | రెండు పురుగులు కనిపించినంత మాత్రాన లైసెన్స్ రద్దు చేస్తారా..? ఎఫ్డీఏ చర్యలను తప్పుబట్టిన బాంబే హైకోర్టు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో ఆటో షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

Bhagyashri Borse | నేను హీరోయిన్ కావడం మా అమ్మకు ఇష్టం లేదు - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్

CM Revanth Reddy | నేనేందుకు రాజీనామా చేయాలి.. 2034 వరకు నేనే సీఎం





