Supreme Court | వివాదాస్పద భోజ్‌శాలలో వసంత పంచమి రోజున పూజలకు సుప్రీం అనుమతి..!
Supreme Court | మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పూజలు చేసుకునేందుకు హిందువులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. వసంత పంచమి నేపథ్యంలో ఈ నెల 20న పూజలకు అనుమతి ఇవ్వాలంటూ హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ పిటిషన్ ఈ నెల 20న పిటిషన్ దాఖలు చేసింది.
Supreme Court | మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పూజలు చేసుకునేందుకు హిందువులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. వసంత పంచమి నేపథ్యంలో ఈ నెల 20న పూజలకు అనుమతి ఇవ్వాలంటూ హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ పిటిషన్ ఈ నెల 20న పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌ను ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ తరఫున సీనియర్ న్యాయవాదులు విష్ణు శంకర్ జైన్, హరి శంకర్ జైన్ వాదనలు వినిపించారు. బాబా కమల్ మౌలానా వెల్ఫేర్ సొసైటీ తరఫున సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. వాస్తవానికి మధ్యప్రదేశ్ ధార్‌లో ఉన్న భోజ్‌శాల ఏఎస్ఐలో ఉన్నది. దీన్ని సర్వసతీ మాత ఆలయంగా హిందువులు భావిస్తున్నారు. ఇక్కడ మౌలానా కమాలుద్దీన్ సమాధి ఉండడంతో ముస్లింలు ప్రార్థనలు చేస్తారు.
18వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ తవ్వకాలు జరిపించింది. ఈ తవ్వకాల్లో సరస్వతీ దేవి విగ్రహం బయటపడింది. బ్రిటిష్ వారు ఈ విగ్రహాన్ని లండన్‌కు తీసుకెళ్లారు. ఆ విగ్రహం ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఉంది. ప్రస్తుతం ఈ స్మారకచిహ్రం భారత పురావస్తుశాఖ పరిధిలో ఉంది. ఇక్కడ ఆలయాన్ని తిరిగి ప్రతిష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ భోజ్‌శాల కాంప్లెక్స్‌లో ప్రతి మంగళవారం హిందువులకు, ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ఏఎస్ఐ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ సంవత్సరం వసంత పంచమి శుక్రవారం వచ్చింది. ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు హిందువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ముస్లింలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించింది. నమాజ్‌కు వచ్చే వారి సంఖ్యను జిల్లా అధికారులకు చెప్పాలని ఆదేశించింది. శాంతిభద్రతల విషయంలో సరైన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని, ప్రభుత్వానికి సూచించింది. ఇదిలా ఉండగా.. భోజ్‌శాల వివాదంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ధార్‌లో 8వేల మందికిపైగా పోలీసులను మోహరించారు. వాచ్ టవర్‌తో పాటు, ఒక పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేసి, సున్నిత ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






