త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | హైద‌రాబాద్ మార‌థాన్‌.. ఆగ‌స్టు 30న న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | ఎన్ఎండీసీ (NMDC) ఆధ్వ‌ర్యంలో ఆగ‌స్టు 30న (ఆదివారం) మార‌థాన్ (Marathon) నిర్వ‌హించ‌నున్నారు. ఫుల్‌, హాఫ్ మార‌థాన్‌ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా (Peoples Plaza) నుంచి, 10 కిలోమీట‌ర్ల మార‌థాన్ మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిష‌న్ హాల్ వ‌ద్ద ప్రారంభం కానున్నాయి.

G

Hyderabad | Published On Aug 28, 2026, 7.25 am IST

Traffic Restrictions | హైద‌రాబాద్ మార‌థాన్‌.. ఆగ‌స్టు 30న న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్‌: ఎన్ఎండీసీ (NMDC) ఆధ్వ‌ర్యంలో ఆగ‌స్టు 30న (ఆదివారం) మార‌థాన్ (Marathon) నిర్వ‌హించ‌నున్నారు. ఫుల్‌, హాఫ్ మార‌థాన్‌ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా (Peoples Plaza) నుంచి, 10 కిలోమీట‌ర్ల మార‌థాన్ మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిష‌న్ హాల్ వ‌ద్ద ప్రారంభం కానున్నాయి. మార‌థాన్ జ‌రిగే మూడు రూట్లు గ‌చ్చిబౌలి స్టేడియం దగ్గర కలుస్తాయి. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ సిటీ నుంచి సైబ‌రాబాద్‌లోని ప‌లు మార్గాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించారు. ఫుల్ మారథాన్ (42.195 కి.మీ.), హాఫ్ మారథాన్ (21.097 కి.మీ.), 10 కి.మీ. కేటగిరీలలో ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల మధ్య నిర్వహిస్తారు. దీంతో వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌లో వెళ్లాల‌ని సూచించారు.

మార‌థాన్ ఇలా..

ఫుల్, హాఫ్ మారథాన్ మార్గాలు- పీపుల్స్ ప్లాజా నుంచి జూబ్లీ హిల్స్ మీదుగా, రోడ్ నంబ‌ర్‌ 45 ద్వారా సైబరాబాద్ పరిధిలోకి ప్రవేశించి, స్టేడియంకు వెళ్లే మార్గంలో కేబుల్ బ్రిడ్జ్, ఐటీసీ కోహినూర్, మైండ్‌స్పేస్, బయో-డైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఐఐఐటీ జంక్షన్ల‌ను దాటుతాయి.

10 కిలోమీటర్ల మారథాన్- హైటెక్స్ దగ్గర ప్రారంభమై, NAC మెయిన్ గేట్, CII జంక్షన్, టెక్ మహీంద్రా, బయో-డైవర్సిటీ జంక్షన్ గుండా ప్రయాణించి, గేట్ నెం 1 ద్వారా స్టేడియంలోకి వెళ్లి కలుస్తుంది.

ఈ రూట్ల‌లో..

మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొల్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఈవెంట్ మార్గాలలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వ‌ర‌కు ట్రక్కులు, లారీలు, డీసీఎంలు, రెడీ-మిక్స్ కాంక్రీట్ క్యారియర్లు, వాటర్ ట్యాంకర్లతో సహా భారీ వాహనాలను అనుమతించరు. ఈ సమయంలో నిషేధిత ప్రాంతాలలో పికప్‌లు, డ్రాప్-ఆఫ్‌లను నివారించాలని క్యాబ్, ఆటో, టాక్సీ అగ్రిగేటర్ కంపెనీలను సూచించారు.

  • షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఖజాగూడ జంక్షన్, నానక్‌రామ్‌గూడ, గోపన్‌పల్లి మీదుగా మళ్లిస్తారు.
  • లింగంపల్లి నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను మసీద్‌బండ టీ-జంక్షన్ వద్ద బొటానికల్ గార్డెన్, అంజయ్య నగర్, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లించి తిరిగి ఖజాగూడ జంక్షన్‌కు చేర్చుతారు.
  • కొండాపూర్, కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అంజయ్య నగర్, రోలింగ్ హిల్స్ మరియు దుర్గం చెరువు మీదుగా దారి మళ్లిస్తారు.
Advertisement
Advertisement