Praggnanandhaa | చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా రికార్డ్
Praggnanandhaa | భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద (Praggnanandhaa) చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీలో క్లాసికల్ విభాగంగాలో విజేతగా నిలిచాడు.
Praggnanandhaa | త్రినేత్ర.న్యూస్: భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద (Praggnanandhaa) చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీలో క్లాసికల్ విభాగంగాలో విజేతగా నిలిచాడు. చివరి రౌండ్‌లో జర్మనీ గ్రాండ్ మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై (Vincent Keymer) గెలుపొందాడు. దీంతో నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద ఘనతకెక్కాడు.
10 రౌండ్ల ఈ టోర్నమెంట్ చివరలో ప్రజ్ఞానంద అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించాడు. వరుసగా రెండు గేమ్స్‌లో ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత వరుసగా నాలుగు క్లాసికల్ గేమ్స్‌లో విజయం సాధించాడు. దీంతో టోర్నీ విజేతగా నిలిచాడు. 20 ఏండ్ల ప్రజ్ఞానందకి ఈ ఏడాది లభించిన తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా నార్వేలోని ఇండియన్ ఎంబసీ భారత గ్రాండ్ మాస్టర్‌ను అభినందించింది. మీ ప్రతిభ, పట్టుదల, ఒత్తిడిలోనూ ప్రదర్శించిన సంయమనం ప్రపంచ వేదికపై భారత చదరంగం బలాన్ని మరోసారి నిరూపించాయని ఎక్స్ వేదికగా పేర్కొంది. ఈ చారిత్రాత్మక విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు అపారమైన గర్వకారణమని తెలిపింది. విజయాల పరంపర ఇలాగే కొనసాగాలని, మరింత ఉజ్వల భవిష్యత్తును పొందాలని ఆకాంక్షించింది.
గత నాలుగు రోజుల్లో అలీరేజా ఫిరోజా, ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌లపై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. ఇదే టోర్నీలో కార్ల్‌సెన్‌పై ప్రజ్ఞానంద రెండుసార్లు విజయం సాధించడం గమనార్హం.
టోర్నీ మొదట్లో ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రజ్ఞానంద అద్భుతంగా పుంజుకుని టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. శుక్రవారం జరిగిన ఓపెన్ విభాగం తొమ్మిదో రౌండ్‌లో ప్రజ్ఞానంద 1-0తో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌పై అద్భుత విజయం సాధించాడు. గుకేశ్ పుంజుకునేందుకు ఎలాంటి అవకాశమివ్వకుండా 34 ఎత్తుల్లో మ్యాచ్ ఫినిష్ చేశాడు. మరోవైపు క్లాసికల్ గేమ్‌లో ఈ ఏడాది కార్ల్‌సన్‌పై రెండు సార్లు గెలిచిన ప్లేయర్‌గా ప్రజ్ఞానంద నిలిచాడు.
Heartiest Congratulations to R. Praggnanandhaa on Winning Norway Chess 2026!
The Indian Embassy in Norway proudly celebrates the remarkable achievement of R. Praggnanandhaa, the Champion of Norway Chess 2026.
Your brilliance, determination, and composure under pressure have… pic.twitter.com/R6c1HGlUDP
— India in Norway (@IndiainNorway) June 5, 2026
🇮🇳 PRAGG WINS NORWAY CHESS 2026
From last place in round 6, and 4 back-to-back wins, he finishes first 🤯🤯#NorwayChess pic.twitter.com/J0XbX91NQ4
— Norway Chess (@NorwayChess) June 5, 2026
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల



