New Delhi | ఢిల్లీలో తగ్గిన కాలుష్యం.. ఆ వాహనాలకు అనుమతి
New Delhi | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో వాయుకాలుష్యం (Air Pollution) కాస్త తగ్గడంతో గత రెండు వారాలుగా బీఎస్ 4 వాహనాల (BS 4 Vehicles)పై అమలులో ఉన్న నిషేధాన్ని అధికారులు ఎత్తివేశారు. ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోవడంతో బీఎస్ 4 వాహనాలను నగరంలో ప్రవేశించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
New Delhi | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో వాయుకాలుష్యం (Air Pollution) కాస్త తగ్గడంతో గత రెండు వారాలుగా బీఎస్ 4 వాహనాల (BS 4 Vehicles)పై అమలులో ఉన్న నిషేధాన్ని అధికారులు ఎత్తివేశారు. ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోవడంతో బీఎస్ 4 వాహనాలను నగరంలో ప్రవేశించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా గాలి నాణ్యత (Air Quality Index)ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది.
గాలి కాలుష్యం ప్రాతిపదికగా ఆంక్షలు
ఢిల్లీలో విపరీతమైన వాయుకాలుష్యం కారణంగా ప్రభుత్వం అవసరానికి తగ్గట్లు ఆంక్షలు విధిస్తుంది. ఈ నెల 13న ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450ని దాటడంతో బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం బీఎస్ 6 వాహనాలు మాత్రమే నగరంలోకి అనుమతించవచ్చనే నిబంధన విధించారు. దీంతో సుమారు 12 లక్షల వాహనాలు నిషేధానికి గురయ్యాయి.
ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాలకు మాత్రమే అనుమతి
ఈ సడలింపు కేవలం ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాలకు మాత్రమే ఉంటుంది. వాహనం ఢిల్లీలో రిజిస్టర్ అయి, చెల్లుబాటైన పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉంటేనే వాహనాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో రిజిస్టర్ కాని బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలు నగరంలోకి ప్రవేశించకూడదు. దీనిని అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తారు.
సంబంధిత వార్తలు

Priyanka Gandhi | మోదీ ప్రభుత్వానికి చీకటి రోజు.. ఈ ఫలితం విపక్షాల ఐక్యతకు నిదర్శనం.. రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రియాంక గాంధీ
ఏప్రిల్ 18, 2026

Delhi New EV Policy | ఢిల్లీలో ఇక పెట్రోల్ టూవీలర్లు, త్రీవీలర్లపై నిషేధం.. ఈవీలపై 100 శాతం పన్ను మినహాయింపు..
ఏప్రిల్ 11, 2026

Air India | ఇరాన్‌తో యుద్ధం.. మే 31 వరకు ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు
ఏప్రిల్ 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



