త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

భార్య ఆత్మహత్య చేసుకుందని 1000 కిమీల దూరం వెళ్లి భర్త సూసైడ్

నెలన్నర క్రితం సూరజ్‌కి గానవి అనే యువతితో పెళ్లి జరిగింది. విద్యారణ్యపురాలో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. కానీ.. గత గురువారం గానవి ఆత్మహత్య చేసుకుంది.

J

Crime | Published On Dec 28, 2025, 6.22 pm IST

భార్య ఆత్మహత్య చేసుకుందని 1000 కిమీల దూరం వెళ్లి భర్త సూసైడ్
Advertisement

పెళ్లయిన కొద్ది రోజులకే భార్య ఆత్మహత్య చేసుకుంది. అత్తామామలు తన వల్లే వాళ్ల కూతురు ఆత్మహత్య చేసుకుందని బెదిరించారు. ఆ యువకుడి కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగారు. పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఇవన్నీ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న రెండు రోజులకే వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లి మరీ భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

35 ఏళ్ల సూరజ్ శివన్నది బెంగళూరులోని విద్యారణ్యపురలోని బీఈఎల్ లేఅవుట్. కానీ.. నాగ్‌పూర్‌లో సూరజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సూరజ్ ఆత్మహత్య చేసుకోవడం చూసి అతడి తల్లి 60 ఏళ్ల జయంతి శివన్న కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు వచ్చి కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. కానీ.. సూరజ్ ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.

నెలన్నర క్రితం సూరజ్‌కి గానవి అనే యువతితో పెళ్లి జరిగింది. విద్యారణ్యపురాలో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. కానీ.. గత గురువారం గానవి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె పేరెంట్స్.. గానవి చావుకి సూరజ్, అతడి ఫ్యామిలీనే కారణం అని.. కట్నం కావాలని వేధింపులు చేయడం వల్లే తమ కూతురు చనిపోయిందని కేసు పెట్టారు. సూరజ్ ఫ్యామిలీపై కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూరులో ఆ యువతి కుటుంబ సభ్యులు నిరసన కూడా చేశారు.

దీంతో తమను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని భయపడిపోయిన సూరజ్, అతడి తల్లి బెంగళూరు వదిలి పారిపోయారు. ఆ తర్వాత వాళ్లు హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి డిసెంబర్ 26న నాగ్‌పూర్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో దిగారు. సూరజ్ తమ్ముడు కూడా వాళ్లతో పాటు నాగ్‌పూర్ వెళ్లాడు. నాగ్‌పూర్ హోటల్‌లో ముగ్గురూ కలిసి ఉన్నారు. తన తల్లి, తమ్ముడు రూమ్‌లో లేని సమయంలో సూరజ్ రూమ్‌లోని ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరజ్‌ని ఆ పరిస్థితుల్లో చూసిన అతడి తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. సరైన సమయానికి సూరజ్ తమ్ముడు అక్కడికి చేరుకోవడంతో తన తల్లిని కాపాడారు కానీ.. సూరజ్ మాత్రం అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. అలా.. తన భార్య ఆత్మహత్య చేసుకున్న రెండు రోజులకే సూరజ్ కూడా చాలా దూరం వెళ్లి నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకోవడంతో సూరజ్ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement