Death Sentence | చిన్నారుపై లైంగిక వేధింపులు.. దంపతులకు మరణశిక్ష
Death Sentence | చిన్నారుల లైంగికంగా వేధించి, వారి నీలిచిత్రాలను అమ్మినందుకు దంపతులకు కోర్టు మరణశిక్ష (Death Sentence) విధించింది. నిందితులైన నీటిపారుదల శాఖ మాజీ జూనియర్ ఇంజినీర్ రామ్ భవన్, అతని భార్య దుర్గావతికి మరణశిక్ష విధిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు (POCSO court) తీర్పు వెలువరించింది.
Death Sentence | త్రినేత్ర.న్యూస్: చిన్నారుల లైంగికంగా వేధించి, వారి నీలిచిత్రాలను అమ్మినందుకు దంపతులకు కోర్టు మరణశిక్ష (Death Sentence) విధించింది. నిందితులైన నీటిపారుదల శాఖ మాజీ జూనియర్ ఇంజినీర్ రామ్ భవన్, అతని భార్య దుర్గావతికి మరణశిక్ష విధిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని బాండా ప్రత్యేక పోస్కో కోర్టు (POCSO court) తీర్పు వెలువరించింది. 2010 నుంచి 2020 మధ్య కాలంలో 3 ఏండ్ల చిన్నారులు సహా దాదాపు 33 మంది మైనర్ బాలలపై (minor children) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నిందితుల ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదును కూడా బాధితులకు సమానంగా పంపిణీ చేయాలని సూచించింది. ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించిన న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మిశ్రా.. నిందితుల క్రూరత్వం సమాజ నైతిక పునాదులనే కదిలించిందని పేర్కొన్నారు.
నిందితులను 2020 అక్టోబర్‌లో సీబీఐ అరెస్టు చేసింది. వారితోపాటు ఢిల్లీకి చెందిన మరో వ్యాక్తినిని కూడా అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆ తర్వాత వదిలేసింది. నిందితుల నివాసాల్లో సోదాల సందర్భంగా రూ.8 లక్షల నగదు, 12 ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్, ఆరు పెన్ డ్రైవ్‌లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన అభ్యంతరకర మెటీరియల్ కూడా ఉందని ఫోరెన్సిక్ టెస్ట్‌లో తేలింది. కాగా, 2 లక్షలకు పైగా అభ్యంతరకర వీడియోలు, ఫొటోలను దాదాపు 47 దేశాలకు ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్స్, డార్క్‌నెట్ చానళ్ల ద్వారా చేరవేసినట్లు ఆధారాలతో సీబీఐ నిరూపించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






