త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 Petrol Row | డీప్‌ఫేక్‌లపై మెటా, గూగుల్‌పై న్యాయపోరాటం.. బాంబే హైకోర్టును ఆశ్ర‌యించిన కేంద్ర‌మంత్రి..

E20 Petrol Row | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యాయ‌పోరాటానికి దిగారు. ఆయ‌న‌తో పాటు కుటుంబంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో కూడిన డీప్‌ఫేక్ వీడియోలు, ప‌రువు న‌ష్టం క‌లిగించే కంటెంట్‌పై పోరుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ వ్యవహారంలో మెటా, గూగుల్‌తో పాటు ఇతర సంస్థలపై సివిల్ దావా వేసేందుకు వేయడానికి బాంబే హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది.

P

National | Published On Jul 27, 2026, 8.20 pm IST

E20 Petrol Row | డీప్‌ఫేక్‌లపై మెటా, గూగుల్‌పై న్యాయపోరాటం.. బాంబే హైకోర్టును ఆశ్ర‌యించిన కేంద్ర‌మంత్రి..
Advertisement

E20 Petrol Row | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యాయ‌పోరాటానికి దిగారు. ఆయ‌న‌తో పాటు కుటుంబంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో కూడిన డీప్‌ఫేక్ వీడియోలు, ప‌రువు న‌ష్టం క‌లిగించే కంటెంట్‌పై పోరుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ వ్యవహారంలో మెటా, గూగుల్‌తో పాటు ఇతర సంస్థలపై సివిల్ దావా వేసేందుకు వేయడానికి బాంబే హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఈ20 ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కార్య‌క్ర‌మంతో గడ్కరీ, ఆయన కుటుంబం వ్యాపార ప్ర‌యోజ‌నం పొందుతున్నారంటూ సోష‌ల్ మీడియా పోస్టులు, డీప్‌ఫేక్ వీడియోల‌తో ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది సందీప్ సింగ్ ల‌డ్డా కోర్టుకు తెలిపారు. ఈ కంటెంట్‌ పూర్తిగా నిరాధారమైనదని, ఉద్దేశపూర్వకంగా పరువు తీసేందుకు రూపొందించారని పేర్కొన్నారు.

డీప్‌ఫేక్‌ వీడియోలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు, సోషల్‌ మీడియా వేదికలపై చర్యలు తీసుకునేందుకు గడ్కరీకి కోర్టు ఊర‌ట‌నిచ్చింది. పరువు నష్టం కలిగించే పోస్టులు, ట్వీట్లు, రీల్స్‌, వీడియోలు, ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌ కంటెంట్ ప‌బ్లిషింగ్‌, వ్యాప్తిని శాశ్వతంగా నిలిపివేయాలని ఆయన కోర‌నున్నారు. ఈ20 ఇథనాల్‌ బ్లెండింగ్‌ విధానాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందని గడ్కరీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కార్యక్రమానికి తానే బాధ్యుడినంటూ కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని, అవి దురుద్దేశపూరితమైనవని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 2026 ఏప్రిల్‌ 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గరిష్ఠంగా 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ విక్రయాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వాహ‌నాల ఇంజిన్ల పనితీరుకు నష్టం కలగకుండా కనీసం 95 రీసెర్చ్‌ ఆక్టేన్‌ నంబర్‌ (RON) ప్ర‌మాణాల‌ను నిర్దేశించింది. ఇథనాల్‌కు సహజంగానే హై ఆక్టేన్‌ విలువ ఉంటుంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపడంతో ఇంజిన్‌లో నాక్‌ ప్రభావం తగ్గుతుంది. చెరకు, మ‌క్కజొన్న, ఇత‌ర ధాన్యాల నుంచి తయారయ్యే ఇథనాల్‌ పునరుత్పాదక ఇంధనం కావడంతో పాటు, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే కాలుష్యం త‌క్కువ‌గా ఉంటుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement