Cabinet Sub-Committee | ఎగుమతి రకాలపై రైతులకు అవగాహన కల్పించాలి
Cabinet Sub-Committee | అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఎగుమతి రకాల వరి సాగును రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సోమవారం ప్రజాభవన్‌లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- వ్యవసాయ నిపుణులతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
Cabinet Sub-Committee | అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఎగుమతి రకాల వరి సాగును రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సోమవారం ప్రజాభవన్‌లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగు పరిస్థితులపై కమిటీ సమగ్రంగా సమీక్ష సమీక్షించారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఆచార్యులు సమావేశంలో పాల్గొని రైతులకు అధిక లాభాలు ఇచ్చే ఎనిమిది ప్రత్యేక వరి రకాల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రతిపాదించారు. బీపీటీ 5204, తెలంగాణ సోనా (RNR 15048), కేఎన్ఎం-1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ, డబ్ల్యూజీఎల్ 962, డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్ 1798 రకాల వంగడాలు దేశీయంగా మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లలోనూ మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఈ రకాల బియ్యానికి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ వంటి దేశాల్లో అధిక ఆదరణ ఉందని, అందువల్ల ఎగుమతులకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు కమిటీకి వివరించారు. ఈ పంటలను సాగు చేస్తే మార్కెట్‌లో మద్దతు ధర (MSP) కంటే కూడా ఎక్కువ ధర లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. విత్తనాల కొరత లేకపోవడంతో పెద్ద ఎత్తున సాగు విస్తరణకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు.
రైతుల ఆదాయం పెరగాలంటే మార్కెట్ ఒడిదొడుకుల నుంచి రక్షణ కలిగించే ఈ 8 రకాల సాగును మాత్రమే ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి రైతులను ఈ దిశగా చైతన్యపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సివిల్ సప్లై అధికారులు కూడా సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం సాగవుతున్న కొన్ని సన్న బియ్యం రకాలపై మార్కెట్‌లో ఆశించిన డిమాండ్ లేకపోవడం, మిల్లింగ్ సమయంలో అధికంగా బియ్యం విరిగిపోవడం వంటి కారణాలతో మిల్లర్లు, వ్యాపారులు వాటిని కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపడం లేదని వివరించారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉన్న నిర్దిష్ట రకాలకే ఇకపై ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డిమాండ్ ఉన్న రకాల సాగు పెరిగితే మిల్లర్లు నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. దీని వల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు వినియోగదారులకు కూడా నాణ్యమైన బియ్యం అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు విధానాన్ని కొనసాగించాలని అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి నివేదించారు. మార్కెట్ డిమాండ్ ఆధారంగా పంటల ఎంపిక జరగాలనే దిశగా వ్యవసాయ విధానాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేందర్ మోహన్, వ్యవసాయ కమిషనర్ గోపీ, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ రాజ్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





