త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | పేర్లు వేరైనా పండుగ ఒక్క‌టే.. దేశ ప్ర‌జ‌ల‌కు మోదీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు..

PM Modi | మకర సంక్రాంతి, మాఘ్ బిహూ, పొంగల్ పండుగల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న లేఖల‌ ద్వారా తన శుభాకాంక్షలను తెలియజేశారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు చెబుతూ.. మకర సంక్రాంతి ఆశ, సానుకూలతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

S

National | Published On Jan 14, 2026, 1.01 pm IST

PM Modi | పేర్లు వేరైనా పండుగ ఒక్క‌టే.. దేశ ప్ర‌జ‌ల‌కు మోదీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు..
Advertisement

PM Modi | మకర సంక్రాంతి, మాఘ్ బిహూ, పొంగల్ పండుగల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న లేఖల‌ ద్వారా తన శుభాకాంక్షలను తెలియజేశారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు చెబుతూ.. మకర సంక్రాంతి ఆశ, సానుకూలతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఈ పండుగను జరుపుకున్నప్పటికీ, భావోద్వేగం, ఉత్సాహం మాత్రం ఒక్కటేనని ఆయన అన్నారు. రైతులకు ఈ పండుగకు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, తమ కష్టశ్రమతో దేశాన్ని పోషిస్తున్న రైతులకు కృతజ్ఞతలు తెలిపే సందర్భమే సంక్రాంతి అని ఆయన అన్నారు.

మాఘ్ బిహూ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ పండుగ అస్సాం సంస్కృతికి ప్రతిబింబమని అన్నారు. ఆనందం, ఆత్మీయత, సోదరభావానికి చిహ్నంగా మాఘ్ బిహూ నిలుస్తుందని పేర్కొన్నారు. మాఘ్ బిహూ కోతకాలం ముగియ‌డానికి సంకేతంగా నిలుస్తుందని, కృతజ్ఞతా భావం, సంతృప్తిని ప్రోత్సహిస్తుందని అన్నారు. రైతుల సేవలను ప్రధాని ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. అందరికీ శాంతి, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు.

పొంగల్ సందర్భంగా ప్ర‌ధాని మోదీ శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ.. త‌మిళ‌ ప్రజలను వణక్కం అంటూ ప‌ల‌క‌రించారు. ఈ పండుగ మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న సన్నిహిత బంధాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. వ్యవసాయం, గ్రామీణ జీవితం, శ్రమ గౌరవాన్ని పొంగల్ ప్రతిబింబిస్తుందని, కుటుంబాలను ఒక్కటిగా చేసి సామాజిక బంధాలను బలోపేతం చేస్తుందని అన్నారు. తమిళ సంప్రదాయాల గొప్పతనానికి ప్రతీకగా పొంగల్ నిలుస్తుంద‌ని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన భాషలలో ఒకటైన తమిళ భాషకు నిలయమైన భారత్ గర్వపడుతోందని అన్నారు. కాగా ఆయా పండుగ‌ల‌ను పుర‌స్క‌రించుకుని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు ప్ర‌ధాని మోదీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మోదీ స్వ‌యంగా పొంగ‌ల్ వండ‌డం విశేషం.

Advertisement

తాజావార్తలు

Advertisement