త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malaika Arora | నేనెందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి..? ఘాటుగా స్పందించిన మ‌లైకా అరోరా..!

Malaika Arora | బాలీవుడ్ క్వీన్ మ‌లైకా అరోరా గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఐదుప‌దుల వ‌య‌సులోనూ ఐట‌మ్స్ సాంగ్స్ చేస్తూ త‌న అంద‌చందాల‌తో అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్న‌ది. ఐట‌మ్స్ సాంగ్స్ విష‌యంలో త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌తో పాటు ట్రోలింగ్‌పై ఘాటుగానే స్పందించింది.

P

Entertainment | Published On Jan 14, 2026, 2.06 pm IST

Malaika Arora | నేనెందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి..? ఘాటుగా స్పందించిన మ‌లైకా అరోరా..!
Advertisement

Malaika Arora | బాలీవుడ్ క్వీన్ మ‌లైకా అరోరా గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఐదుప‌దుల వ‌య‌సులోనూ ఐట‌మ్స్ సాంగ్స్ చేస్తూ త‌న అంద‌చందాల‌తో అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్న‌ది. ఐట‌మ్స్ సాంగ్స్ విష‌యంలో త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌తో పాటు ట్రోలింగ్‌పై ఘాటుగానే స్పందించింది. తాను ఎవ‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇటీవ‌ల ఓ యూట్యూబ్ షోలో మ‌లైకా పాల్గొని ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేసింది. డ్యాన్స్‌ను ఎందుకు త‌గ్గించుకోవాలి? ఎందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. ట్రోలింగ్ ఎప్పుడూ జ‌రుగుతూనే ఉంటుంద‌ని తెలిపింది. డ్యాన్స్ అనేది ఓ భావ ప్ర‌క‌ట‌న అని, దాన్ని గౌర‌వంతో ఆస్వాదించాల‌ని సూచించింది. తాను 52 ఏళ్ల వ‌య‌సులోనూ చేయ‌గ‌లుగుతున్నానంటే అది త‌న అదృష్ట‌మ‌ని, తాను స‌రైన మార్గంలోనే ఉన్నాన‌ని భావిస్తున్న‌ట్లు మ‌లైక చెప్పుకొచ్చింది.

ఐటెం సాంగ్స్‌లో నటించడం త‌న‌కు శ‌క్తినిస్తుంద‌ని, అద్భుతంగా ఫీల‌య్యేలా చేస్తుంద‌ని, త‌న‌ను తాను శ‌క్తివంతంగా మారుస్తుంద‌ని తెలిపింది. త‌న ప‌ని చూసి ఇత‌ర మ‌హిళ‌లు స్పూర్తి పొందితే అంత‌కు మంచిన సంతృప్తి ఇంకొక‌టి ఉండ‌ద‌ని చెప్పారు. 1997 'గుర్ నాలోన్ ఇష్క్ మిఠా' ప్రైవేట్ ఆల్బ‌మ్ సాంగ్‌తో కెరీర్‌ను మొద‌లు పెట్టింది. ఆ త‌ర్వాత షారుఖ్ ఖాన్ మూవీ దిల్ సే మూవీలో 'ఛయ్య ఛయ్య' పాట‌లో న‌టించ‌గా మంచి గుర్తింపు పొందింది. అనంత‌రం ప‌లు సినిమాల్లో న‌టించ‌డంతో పాటు అగ్ర హీరోల మూవీల్లో ఐట‌మ్స్ సాంగ్స్‌లో మెరిసింది. తెలుగులోనూ మ‌హేశ్ బాబు అతిథి మూవీలో రాత్రైనా పాట‌కు, ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాట‌లో న‌టించింది. ఇటీవల హనీ సింగ్‌తో 'చిల్‌గమ్', 'తమ్మ' సినిమాలోని 'పాయిజన్ బేబీ' పాటలతో ప్రేక్షకులను అల‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement