Princess Leonor | చరిత్ర సృష్టించబోతున్న ప్రిన్సెస్ లియోనోర్.. 150 ఏళ్ల తర్వాత తొలిసారిగా..!
Princess Leonor | స్పెయిన్ రాణిగా 20 సంవత్సరాల లియోనోర్‌కి పట్టాభిషేకం జరుగనున్నది. స్పెయిన్ చరిత్రలో దాదాపు 150 సంవత్సరాల తర్వాత ఓ మహిళా రాణిగా పగ్గాలు స్వీకరించనున్నది. 1833 నుంచి 1868 వరకు పాలించిన క్వీన్ ఇసాబెల్లా II తర్వాత లియోనోర్‌కే ఈ అవకాశం దక్కనున్నది.
International | Published On Jan 14, 2026, 2.53 pm IST
Princess Leonor | స్పెయిన్ రాణిగా 20 సంవత్సరాల లియోనోర్‌కి పట్టాభిషేకం జరుగనున్నది. స్పెయిన్ చరిత్రలో దాదాపు 150 సంవత్సరాల తర్వాత ఓ మహిళా రాణిగా పగ్గాలు స్వీకరించనున్నది. 1833 నుంచి 1868 వరకు పాలించిన క్వీన్ ఇసాబెల్లా II తర్వాత లియోనోర్‌కే ఈ అవకాశం దక్కనున్నది.
ప్రిన్సెస్ లియోనోర్ ఎవరు?

కింగ్ జువాన్ కార్లోస్ I పాలనలో అక్టోబర్ 31, 2005న జన్మించిన అస్టురియాస్ యువరాణి లియోనోర్.. కింగ్ ఫిలిప్ VI- రాణి లెటిజియా పెద్ద కూతురు. ఆమె లియోనోర్ శాంటా మారియా డి లాస్ రోసాలెస్ పాఠశాలలో చదువుకుంది. వేల్స్‌లోని వేల్ ఆఫ్ గ్లామోర్గాన్‌లో ఉన్న యూడబ్ల్యూసీ అట్లాంటిక్ కళాశాలలో ఉన్నత విద్యనభ్యసించింది. అక్కడే ఇంటర్నేషనల్ బాకలారియేట్‌లో డిప్లొమా పూర్తి చేశారు. తాజాగా పట్టాభిషేకంతో యువరాణి లియోనోర్ చరిత్ర సృష్టించనున్నది. రాణి ఇసాబెల్లా II తర్వాత స్పానిష్ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళగా నిలువనున్నది. అయితే, ఆమె పాత్ర అలంకారప్రాయమే అయినా.. దేశ రక్షణ వ్యవస్థపై అవగాహన ఉన్న ఆమె రాణిగా బాధ్యతలు స్వీకరించనుండడం యూరప్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

స్పానిష్ వారసత్వ యుద్ధంలో హాబ్స్‌బర్గ్‌లపై విజయం సాధించిన తర్వాత 1700 ప్రారంభం నుంచి స్పానిష్ సింహాసనాన్ని కలిగి ఉన్న హౌస్ ఆఫ్ బోర్బన్‌కు యువరాణి లియోనోర్ వారసురాలు. జనరల్ ఫ్రాంకో నియంతృత్వం ముగిసిన తర్వాత 1975లో స్పెయిన్‌లో రాచరిక పాలనను పునరుద్ధరించారు. లియోనోర్ తాత, రాజు జువాన్ కార్లోస్ I సింహాసనాన్ని అధిష్టించారు. ఆయన స్పెయిన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన 2014లో సింహాసనాన్ని వదులుకొని తన కొడుకు ఫిలిప్ VIకి పట్టాభిషేకం చేశారు.
కింగ్ ఫిలిప్ వారసురాలిగా..

2004లో యువరాజు ఫిలిప్ మాజీ జర్నలిస్ట్ లెటిజియాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు లియోనోర్ డి బొర్బన్ వై ఓర్టిజ్, చెల్లెలు ఇన్పాంటా సోఫియా. సోఫియా 2007లో జన్మించింది. ప్రిన్సెస్ లియోనోర్ ఆగస్టు 2023లో జనరల్ మిలిటరీ అకాడమీలో మూడేళ్ల సైనిక విద్య పూర్తి చేశారు. స్పానిష్ చట్టం ప్రకారం మిలటరీ అకాడమీలో శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. స్పానిష్ వారసులు తప్పనిసరిగా సైన్యం, నేవీ, వైమానిక దళంలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. 20 ఏళ్ల యువ రాణి స్పానిష్, కాటలాన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, మాండరిన్‌తో సహా అనేక భాషలను అనర్గళంగా మాట్లాడడం, చదవడంతో పాటు రాయగలుగుతుంది.
2024లో లియోనార్ గలీసియాలో నేవి శిక్షణ ప్రారంభించారు. జువాన్ సెబాస్టియన్ డీ ఎల్కానో అనే శిక్షణా నౌకలో 140 రోజుల్లో శిక్షణ పూర్తి చేశారు. ఆమె పని చేసిన నౌక అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా, దక్షిణ అమెరికా, న్యూయార్క్‌కు ప్రయాణించింది. యువరాణి పైలట్‌గాను శిక్షణ తీసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి స్పానిష్ రాజకుటుంబంలోని మహిళగా నిలిచింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






