Andhra Pradesh | సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదం.. కాలి బూడిదైన 38 ఇళ్లు
Andhra Pradesh | సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో నిన్న సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
Andhra Pradesh | త్రినేత్ర.న్యూస్ : సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో నిన్న సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ గుడిసెలో చెలరేగిన మంటలు.. మొత్తం 38 గుడిసెలకు వ్యాపించాయి. అన్ని గుడిసెలు కూడా కాలి బూడిదయ్యాయి.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సార్లంకపల్లె గ్రామస్తులందరూ సరుకులు, కొత్తబట్టలు కొనుక్కునేందుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తునికి నిన్న సాయంత్రం వెళ్లారు. వాళ్లు తిరిగొచ్చే లోపే ఊరంతా కాలిపోయింది. తాటాకు గుడిసెలన్నీ బూడిదగా మారాయి. విలువైన వస్తువులు, బట్టలతో పాటు ఆధార్ కార్డు వంటి కీలకమైన డాక్యుమెంట్లు కూడా కాలిపోయాయి. గ్రామస్తులందరూ కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గ్యాస్ లీక్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు.
సార్లంకపల్లె గ్రామస్తులందరికీ అండగా ఉండాలని సీఎం చంద్రబాబు స్థానిక నేతలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల నగదును అందజేయాలని సూచించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. అప్పటి వరకు బాధితులకు అవసరమైన వసతి, ఇతర సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు.
https://x.com/i/status/2010933785312043358
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






