Danam Nagendar | హైదరాబాద్‌ల మామూల్గ ఉండదు.. ఎలక్షన్ కమిషన్ తగలబడిపోతది
Danam Nagendar | సర్ పేరుతో ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుందని దానం నాగేందర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
- ఆన్‌లైన్‌ల సబ్‌మిట్ అయితున్నయ్.. ఢిల్లీల డిలీటైపోతున్నయ్
- పోయిన 20 వేల ఓట్లను పునరిద్ధరించకుంటే ఏం జేయాల్నో మాకు తెల్సు
- మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్
Danam Nagendar | త్రినేత్ర న్యూ: సర్ పేరుతో ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుందని దానం నాగేందర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిమాయత్‌నగర్ డివిజన్‌లోనే 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఆ ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓట్లు తీసేసి ఎన్నికలకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. ఇప్పుడు కమిషనర్‌కు కంప్లైంట్ ఇవ్వడానికే వెళ్తున్నానన్నారు. ఈమేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సర్ గురించి రాహుల్ గాంధీగారు పదే పదే ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తుండు. ఇప్పుడు మా నియోజకవర్గంలో స్పెషల్‌గా 20 వేల ఓట్లు కట్ చేశారు. నోటీసులు ఇచ్చారు. దాన్ని రెక్టిఫై చేయాలి. ఓట్ చోరీ అని అందుకే చెప్తున్నం. నాకొచ్చిన రిపోర్డ్ ప్రకారంగా ఇప్పటివరకు 20 వేలు.. ఇంకా ఎన్ని ఓట్లు పోయినయే తెల్వదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్‌కు నేన్ కంప్లైంట్ ఇస్తా. ఇండ్ల చాలా మంది బీజేపీతో కలిసిపోయి పెద్ద ఎత్తున ఓట్లు తీసే ప్రయత్నం చేస్తున్నరు. ఇప్పుడు కమిషనర్‌కు కంప్లైంట్ ఇయ్యనీకి పోతున్నా. ఓటు చోరీకి ప్రయత్నిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. 2000, 2002 జెన్యూన్ ఓటర్స్ ఉండే. మళ్లీ ఇప్పుడు, మొన్న పార్లమెంట్ ఎలక్షన్‌ల టైంల కూడా ఉండే. ఇప్పుడు తీసేశారు. పెద్ద ఎత్తున ఓటు చోరీ జరుగుతుంది.
ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇప్పటివరకు డిలీట్ చేసిన ఓట్లను మళ్లీ కలపాలి. లేని పక్షంలో ఆందోళనలు కొనసాగిస్తం. హైదరాబాద్‌లో మాత్రం మామూలుగా ఉండదు. ఎలక్షన్ కమిషన్ గానీ ఇది గానీ మొత్తం తగలబడిపోతది. ఓట్లు తీసేసి ఎన్నికలకు పోవడం దురదృష్టకరం. 20 వేల ఓట్లు ఎందుకు తీశారు? ఇక్కన్నుంచి ఆన్‌లైన్‌ల ఏస్తున్నరు. ఢిల్లీల డిలీటైపోతున్నయ్. ఢిల్లీల కూసోని మానిటర్ చేస్తున్నరు వీళ్లందరు.
ఏఆర్‌వో, ఏఎంసీ అప్రూవల్ లేదు
ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ అయిపోతే మా కంట్రోల్‌లో ఏం లేదు. ఏఆర్‌వో, ఏఎంసీ అప్రూవల్ లేదు ఏం లేదు. డైరెక్ట్‌గా ఎల్లిపోతున్నయ్.. డిలీట్ అయిపోతున్నయ్. పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది. దీన్ని ఎట్ల కాపాడుకోవాల్నో మాకు తెల్సు. ఏఆర్వోలు, ఏఎంసీల మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని దానం డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

PHD Student Murdered | కోకాపేట్లో పీహెచ్డీ విద్యార్థి దారుణ హత్య
అక్టోబర్ 1, 2026

Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్
అక్టోబర్ 1, 2026

Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●PHD Student Murdered | కోకాపేట్లో పీహెచ్డీ విద్యార్థి దారుణ హత్య
- ●PM Modi | సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ
- ●GST Collections | సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2.04 లక్షల కోట్లు.. 14.7 శాతం వృద్ధి..
- ●Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్
- ●Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి
- ●Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ టూల్.. క్రియేటర్లకు ఇక డేటానే గైడ్..

PHD Student Murdered | కోకాపేట్లో పీహెచ్డీ విద్యార్థి దారుణ హత్య

PM Modi | సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ

GST Collections | సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2.04 లక్షల కోట్లు.. 14.7 శాతం వృద్ధి..

Kishan Reddy | దేవుళ్లపై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమలుచేయకుండా నాటకాలు.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్



