PM Modi | ఎపిస్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోదీ పేరు.. తీవ్రంగా తిరస్కరించిన భారత్..
PM Modi | జెఫ్రీ ఎపిస్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ప్రస్తావనను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. దానిని.. దోషిగా తేలిన నేరస్తుడి అర్థరహిత, చౌకబారు ఊహాగానాలే తప్ప మరేమీ కాదని పేర్కొంటూ, అలాంటి వ్యాఖ్యలను అత్యంత తిరస్కరణతో కొట్టిపారేయాలని స్పష్టం చేసింది.
PM Modi | జెఫ్రీ ఎపిస్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ప్రస్తావనను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. దానిని.. దోషిగా తేలిన నేరస్తుడి అర్థరహిత, చౌకబారు ఊహాగానాలే తప్ప మరేమీ కాదని పేర్కొంటూ, అలాంటి వ్యాఖ్యలను అత్యంత తిరస్కరణతో కొట్టిపారేయాలని స్పష్టం చేసింది. అమెరికా అధికారులు ఇటీవల విడుదల చేసిన ఈ ఫైళ్లు దోషిగా నిర్ధారితమైన లైంగిక అక్రమ రవాణాదారుడు జెఫ్రీ ఎపిస్టీన్ కు సంబంధించినవే. కాగా ఎపిస్టీన్ ఫైళ్లుగా పిలవబడుతున్న వాటిలోని ఒక ఈ-మెయిల్ సందేశంపై వచ్చిన వార్తలను తాము చూశామని, అందులో ప్రధాని, ఆయన ఇజ్రాయెల్ పర్యటనకు సంబంధించిన ప్రస్తావన ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 2017లో ప్రధాని చేసిన అధికారిక ఇజ్రాయెల్ పర్యటన అనే వాస్తవాన్ని తప్పితే, ఆ ఈ-మెయిల్‌లోని మిగిలిన అన్ని వివరాలు దోషిగా తేలిన నేరస్తుడి చెత్త ఊహాగానాలే అని, అవి అత్యంత తిరస్కరణతో విస్మరించదగినవే.. అని ఆయన అన్నారు. కాగా సదరు ఈ-మెయిల్ అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన దర్యాప్తు ఫైళ్లలో భాగం అని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన ఓ చట్టం ప్రకారం, ఆ శాఖ మొత్తం 35 లక్షల పేజీలు, 2వేల వీడియోలను ప్రజలకు అందుబాటులో ఉండేలా విడుదల చేసింది. ఈ క్రమంలో ఎపిస్టీన్ ఫైల్స్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






