CJP Abhijeet Dipke | ఒకటో తరగతికి లక్షన్నర ఫీజు అయితే.. డబ్బులు ఎక్కడ్నుంచి వస్తయ్..?
CJP Abhijeet Dipke | దేశంలోని యువత, సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సెప్టెంబర్ నెలలో "క్యా బోల్తీ పబ్లిక్" పేరుతో దేశవ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే( Abhijeet Dipke ) గురువారం ప్రకటించారు. రెండు రోజుల పాటు జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం డిప్కే ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
తరం మారుతున్నది..
స్వరం మారుతున్నది
ఒకటో తరగతికి లక్షన్నర ఫీజా?
అన్ని డబ్బులు ఎలా సేవ్ చేస్తాం
94000 సర్కారు బడులను మూసేశారు? ఎందుకని?
రాత్రికి రాత్రే పార్టీలను చీల్చేస్తున్నారు
ఒకప్పుడు ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకునేవారు
ఇప్పుడు ప్రభుత్వమే..ఎవరు ఓటేయాలో నిర్ణయిస్తున్నది
కోర్టుల్లో కామన్ మ్యాన్ కేసులు హియరింగ్‌కే రావు
బిజినెస్ మెన్‌లైతే.. అర్ధరాత్రైనా అర్జంట్ హియరింగ్..
వెంటనే తీర్పు కూడా వచ్చేస్తుంది
అందుకే జనం కోపంగా ఉన్నారు
ఈ దేశంలో 60 శాతం 35 ఏళ్ల లోపు వారే
క్యా బోల్తీ పబ్లిక్.. పేరుతో
సెప్టెంబర్ నుంచి పబ్లిక్ టూర్
ప్రకటించిన సీజేపీ
CJP Abhijeet Dipke | త్రినేత్ర.న్యూస్: ఒకటో తరగతి అడ్మిషన్ కోసం లక్షన్నర ఫీజు కట్టాలా? ఓ మధ్య తరగతి కుటుంబం అంత సేవింగ్స్ చేయగలదా? ఎక్కడి నుంచి వస్తాయి అన్ని డబ్బులు. ఇంకోవైపు గత పదేళ్లలో 94000 సర్కారు బడులను మూసేశారు. మరి కామన్ మ్యాన్‌కు చదువు ఎట్లా? విద్య వ్యాపారమా? ప్రాథమిక హక్కా? ఒకప్పుడు జనం ఓట్లేసి సర్కారును ఎన్నుకునేవారు. ఇప్పుడేమో.. సర్కారే.. ఎవరు ఓటేయాలో నిర్ణయిస్తున్నది. ఇక ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది. ఓ పేదవాడు కోర్టుకు వెళితే అతని కేసు హియరింగ్‌కే రాదు. ఆ కేసు తేలడానికి ఏళ్లకు ఏళ్లు పడతుంది. అదే బిజినెస్ మ్యాన్ అనుకోండి.. అర్థరాత్రైనా సరే అర్జంట్‌గా వింటారు. అప్పటికప్పుడు తీర్పు కూడా ఇచ్చేస్తారు. ఇట్లా వ్యవస్థలన్నీ.. జనం కోసం కాకుండా ధనవంతుల కోసమే పనిచేస్తుంటే ప్రజల్లో ఎందుకు ఆందోళన రాదు.. అందుకే మేం జనంలోకి వెళ్లాలనుకుంటున్నాం. వారి సమస్యలేమిటో వింటాం. వారికి ఏం కావాలో తెలుసుకుంటాం. మేం మరో రాజకీయ పార్టీగా ఎదగదల్చుకోలేదు. ప్రజా సంఘాలతో సంఘటితమై రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రెషర్ గ్రూప్‌గా ఉండదలుచుకున్నాం... అని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. రెండు రోజుల మథనం తర్వాత గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. తమ ఎజెండా ఏమిటో, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో స్పష్టపరిచింది.

క్యా బోల్తీ పబ్లిక్
దేశంలోని యువత, సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సెప్టెంబర్ నెలలో "క్యా బోల్తీ పబ్లిక్" పేరుతో దేశవ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే గురువారం ప్రకటించారు. రెండు రోజుల పాటు జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం డిప్కే ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అధికారంలో ఉన్నవారు ప్రజల సమస్యలను వినడానికి సిద్ధంగా లేరని, వారు పబ్లిక్‌కు పూర్తిగా డిస్‌కనెక్ట్ అయ్యారని ఆయన విమర్శించారు. "ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించి మేం గొప్ప విజయం సాధించామని అందరూ అంటున్నారు. అయితే దానికన్నా మేం సాధించిన గొప్ప విజయం ఏమిటంటే.. ఇన్నేళ్లుగా ప్రభుత్వం పట్ల ప్రజల్లో పేరుకుపోయిన ఓ భయాన్ని దూరం చేశాం. కేసులు పెడతారని తెలిసినా వేలాది మంది జనం మా ఆందోళనల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మాకు మద్దతు పలికారు. మహాత్మా గాంధీ ఆచరించిన అహింస సిద్ధాంతం, అంబేద్కర్ రూపొందించిన సోషల్ జస్టిస్ థియరీ, దేశాన్ని ఆధునిక భారతంగా మార్చిన నెహ్రూ విజనే కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధాంతాలు" అని డిప్కే చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ వెబ్ సైట్ ద్వారా ఎవరైనా సరే సభ్యత్వం తీసుకోవచ్చని పార్టీ ప్రతినిధులు తెలిపారు. అయతే తాము ఎలాంటి విరాళాలు స్వీకరించడం లేదని.. అలా ఎవరైనా అడిగితే తిరస్కరించండని విన్నవించారు.
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై పరిమితి విధించాల్సిందే
"మన దేశంలో విద్యార్థులకు సరిపడా.. స్కూళ్లలో అడ్మిషన్లు ఉండవు. గత పదేండ్లలో 94వేల సర్కారు స్కూళ్లు మూతబడ్డాయి. ఇంకోవైపు ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతికే లక్ష, లక్షన్నర ఫీజు కట్టాల్సి వస్తున్నది. ఒక మధ్యతరగతి కుటుంబం అంత డబ్బులు ఎలా సంపాదిస్తుంది. అన్ని సేవింగ్స్ ఉంటాయా? నెల నెలా ఇల్లు నడపాలంటేనే.. 40, 50వేలు ఖర్చవుతాయి. అవి కాకుండా ప్రతి నెలా ఇంకో పదివేలు స్కూల్ ఫీజు ఎక్కడి నుంచి తెస్తారు? అందుకే ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై పరిమితి విధించాల్సిందే. ఒక నిరుపేద విద్యార్థి చక్కగా చదువుకునేలా విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలి. విద్య.. రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రాథమిక హక్కు. అంతే కానీ వ్యాపారం కాదు" అని డిప్కే చెప్పారు.
పార్టీలను చీల్చేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ
రాజకీయ పార్టీలు, వ్యక్తుల పట్ల కూడా జనంలో నమ్మకం పోతున్నదని ఈ సందర్భంగా డిప్కే విమర్శించారు. "ఉదయం ఒక పార్టీలో ఉన్నవారు సాయంత్రాని కల్లా మరో పార్టీలోకి మారిపోతున్నారు. సర్కారు.. ఈడీ, సీబీఐ, ఐటీలను పంపి పార్టీలను చీలుస్తున్నది. ఒకప్పుడు జనమే ప్రభుత్వాలను ఎన్నుకునేవారు. ఇప్పుడు ఎవరు ఓటేయాలో సర్కారే నిర్ణయిస్తున్నది. ఈ పద్ధతిలో ఎన్నికలు మ్యానిప్యులేషన్ అవుతూనే ఉంటాయి. అందుకే పొలిటికల్ సిస్టమ్‌పై ప్రజలకు నమ్మకం పోతున్నది" అని డిప్కే తూర్పారబట్టారు.
హమారా పాస్ టైం నహీ హై
న్యాయ వ్యవస్థలో ఉన్న అనేక లోపాల వల్ల సామాన్యుడికి అసలు న్యాయమే దక్కకుండా పోతున్నదని అభిజిత్ అన్నారు. "కోర్టుల్లో కామన్ మ్యాన్ కేసులు అంత త్వరగా హియరింగ్‌కు రావు. అదే బిజినెస్ మెన్ అనుకోండి. అర్థరాత్రైనా సరే.. విని అర్జంట్‌గా తీర్పు ఇచ్చేస్తారు. సాధారణ జనం కోసం మాత్రం.. అభీ హమారా పాస్ టైం నహీ హై అని చెబుతారు. ఈ వ్యవస్థ మారాలి" అని చెప్పారు.
35 లోపు ఉన్నవారు 60 శాతం
రానున్న రోజుల్లో ఈ దేశాన్ని నడిపించేది యువతేనని అభిజిత్ తెలిపారు. "ఈ దేశంలో 60 శాతం 35 ఏళ్లలోపు వారే. వారి ఆలోచనలు పట్టించుకోకుండా వారికి ఏం కావాలో తెలుసుకోకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే... జంతర్ మంతర్ లాంటి ఆందోళనలు పుడుతుంటాయి. ఓ వర్గం మీడియా కూడా జనం సమస్యలు పట్టించుకోకుండా ప్రతి సర్కారు నిర్ణయాన్ని మాస్టర్ స్ట్రోక్‌గా అభివర్ణిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నా మాస్టర్ స్ట్రోక్‌గా విశేషంగా చెబుతున్నారు. ఇలా మీరు ప్రభుత్వం వైపే ఉంటే జనం మాటను పట్టించుకోకుంటే వారు మిమ్మల్ని దూరం పెడుతారు" అని చెప్పారు.
తాజావార్తలు
- ●Virat Kohli | కోహ్లీ మరో చరిత్ర.. వన్డేల్లో 15 వేల పరుగులు.. సచిన్ రికార్డుపైనే కన్ను..!
- ●Pink Power Run 3.0 | నెక్లెస్ రోడ్డుపై 35 వేల మందితో పరుగుల పండగ: రొమ్ము క్యాన్సర్‌పై పోరుకు హైదరాబాద్ పింక్ పవర్ రన్ 3.0
- ●Boeing 737 Max | బోయింగ్ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్వేర్ లోపం
- ●Tollywood | ప్రభాస్ బర్త్‌డేకు థియేటర్లలోకి రోమియో జూలియట్
- ●Fake Notes | మార్కెట్లోకి 500 రూపాయల నకిలీ నోట్లొచ్చేశాయ్.. బీ కేర్ ఫుల్
- ●Malayalam OTT | 25 కోట్ల బడ్జెట్ - 325 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి మమితాబైజు మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ

Virat Kohli | కోహ్లీ మరో చరిత్ర.. వన్డేల్లో 15 వేల పరుగులు.. సచిన్ రికార్డుపైనే కన్ను..!

Pink Power Run 3.0 | నెక్లెస్ రోడ్డుపై 35 వేల మందితో పరుగుల పండగ: రొమ్ము క్యాన్సర్‌పై పోరుకు హైదరాబాద్ పింక్ పవర్ రన్ 3.0

Boeing 737 Max | బోయింగ్ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్వేర్ లోపం

Tollywood | ప్రభాస్ బర్త్‌డేకు థియేటర్లలోకి రోమియో జూలియట్






