Mallikarjun Kharge | విద్యార్థులపై పోలీసుల చర్య.. సభలో ప్రకటన చేయడానికి అమిత్‌షాకు ఏం అడ్డంకులు ఉన్నాయ్..?
Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జులై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి ఆందోళనకారులపై పోలీసుల చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలని, విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Mallikarjun Kharge | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జులై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి ఆందోళనకారులపై పోలీసుల చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలని, విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభ సజావుగా జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, సభ్యులు లేవనెత్తిన ఆందోళనలపై ప్రభుత్వం స్పందించాలని స్పష్టం చేశారు.
"శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, పెల్లెట్ గన్‌లను ఉపయోగించమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు..? ఈవిషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలి. విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి. ఈ విషయంపై ప్రకటన చేయడానికి ఆయనకు ఏం అడ్డంకులు ఉన్నాయ్..? రాజ్యసభలోనూ మేం ఈ అంశాన్ని లేవనెత్తాం. మాది సాధారణ అభ్యర్థన. ఇది పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది. అయినప్పటికీ దీనిపై ప్రకటన చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మా రాజ్యసభ ఎంపీలు గురువారం చైర్మన్‌ను కలిసి ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, కేంద్ర హోం మంత్రి సభలో ప్రకటన చేయాలని కోరారు. స్పందించిన చైర్మన్.. ఈ విషయంపై హోం మంత్రి సభకు వచ్చి మాట్లాడాలని సభలోని సభ్యులందరూ కోరుకుంటున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజుకి చెప్పారు. అయితే, ఈ సమస్యను పరిష్కరించే అధికారం రిజుజుకు లేదు. ఆయన కేవలం విషయాన్ని తెలియజేస్తారు. ఆ తర్వాత సమస్య నీరుగారిపోతుంది" అని ఖర్గే అన్నారు.
సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినప్పుడు తనకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదని ఖర్గే ఈ సందర్భంగా ఆరోపించారు. "నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినప్పుడు, నన్ను మాట్లాడనివ్వరు. మేము సభ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాము. మేము లేవనెత్తిన ఆందోళనలపై ప్రభుత్వం స్పందించాలి. ఇంత జరిగినా హోంమంత్రి సభలో ప్రకటన చేయలేదు. కనీసం ప్రధాని మోదీ సభకు రాలేదు. క్షమాపణలు చెప్పలేదు" అని ఖర్గే వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలపై కూడా ఖర్గే స్పందించారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలను తమ పార్టీ లేవనెత్తుతూనే ఉంటుందని చెప్పారు. వారికి అండగా ఉంటామని చెప్పారు.
Also Read..
గోపాలపురం పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు
ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెంపు..? కేంద్రం కొత్త ప్లాన్‌తో వినియోగదారులపై భారం..?
తాజావార్తలు
- ●Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి
- ●Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి

Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ






