Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..
Google Trends India 2026 | భారతీయుల ప్రయాణ ప్రణాళికల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయ పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికే పరిమితం కాకుండా వెల్‌నెస్ టూరిజం, చిన్నపాటి విహారయాత్రలు, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణమైన బస, ఒంటరిగా ప్రయాణించడంపై ఆసక్తి పెరుగుతోంది. గూగుల్ ట్రెండ్స్ 2026 గణాంకాలు ఈ మార్పులను వెల్లడించాయి.
Technology | Published On Nov 23, 2026, 7.33 pm IST
Google Trends India 2026 | భారతీయుల ప్రయాణ ప్రణాళికల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయ పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికే పరిమితం కాకుండా వెల్‌నెస్ టూరిజం, చిన్నపాటి విహారయాత్రలు, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణమైన బస, ఒంటరిగా ప్రయాణించడంపై ఆసక్తి పెరుగుతోంది. గూగుల్ ట్రెండ్స్ 2026 గణాంకాలు ఈ మార్పులను వెల్లడించాయి.
పెరిగిన ఫిట్‌నెస్ ట్రిప్‌లు..
భారతీయ పర్యాటకులు తమ ప్రయాణాలను వ్యక్తిగత ఆసక్తులు, ప్రకృతి అనుభూతులు, బహిరంగ కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా రూపొందించుకుంటున్నారు. గూగుల్ ట్రెండ్స్ 2026 నివేదిక ప్రకారం.. అనుభవాత్మక పర్యాటకం, స్వల్పకాలిక విహారయాత్రలు, సోలో ట్రావెల్ ప్రధాన ధోరణులుగా మారుతున్నాయి. హిడెన్ జెమ్స్ ఇండియా సెర్చ్‌లు 400 శాతం పెరగగా, వెల్‌నెస్ ట్రావెల్ ఇండియా సెర్చ్‌లు ఏకంగా 1,600 శాతం వృద్ధి చెందాయి. ఫిట్‌నెస్ ట్రిప్ సెర్చ్‌లు 950 శాతం, సైలెంట్ రిట్రీట్ సెర్చ్‌లు 150 శాతం పెరిగాయి. హైకింగ్ ట్రయల్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్‌కు సంబంధించిన ప్రయాణాలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. సాధారణ సెలవులకే పరిమితం కాకుండా వారాంతాల్లో, ఇతర సాధారణ రోజుల్లోనూ విహారయాత్రలకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. వీకెండ్ గెట్‌అవేస్ నియర్ మీ, లాంగ్ వీకెండ్ ట్రావెల్ సెర్చ్‌లు ప్రజాదరణ పొందుతున్నాయి. వన్ డే ట్రిప్ నియర్ మీ సెర్చ్‌లు గతేడాదితో పోలిస్తే 130 శాతం పెరగ్గా, ఈ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.
జీవనశైలికి అనుగుణంగా విహార యాత్రలు..
ప్రయాణికులు తమ జీవనశైలికి అనుగుణంగా వసతి సౌకర్యాలను ఎంచుకుంటున్నారు. పెంపుడు జంతువులకు అనుకూలమైన హోటళ్లు, తక్కువ ఖర్చుతో కూడిన హోమ్‌స్టేలు, కుటుంబాలకు అనువైన పర్యాటక ప్రాంతాల కోసం సెర్చ్‌లు గణనీయంగా పెరిగాయి. మరోవైపు ఒంటరిగా ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్నట్లు గూగుల్ సెర్చ్ ధోరణులు సూచిస్తున్నాయి. సోలో ట్రావెల్ గైడ్, బెస్ట్ ప్లేసెస్ టు ట్రావెల్ సోలో, సోలో ట్రావెల్ కాస్ట్ ఇండియా సెర్చ్‌లు కొత్త ట్రెండ్‌గా మారాయి. తోటి ప్రయాణికులతో పరిచయాలు పెంచుకునేందుకు, ఒకే విధమైన ఆసక్తులున్న వారితో అనుసంధానం కావడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ట్రావెల్ కమ్యూనిటీ సెర్చ్‌లు 400 శాతం పెరిగాయి.
పెరుగుతున్న ఏఐ వినియోగం..
ప్రయాణ ప్రణాళికల్లో కృత్రిమ మేధ వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. ఏఐ ఫర్ ట్రావెల్ సెర్చ్‌లు గతేడాదితో పోలిస్తే 600 శాతం పెరిగినట్లు గూగుల్ ట్రెండ్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో గూగుల్ తన ఏఐ టూల్స్ ద్వారా ప్రయాణ ప్రణాళికలను సులభతరం చేసే మూడు మార్గాలను వివరించింది. గూగుల్ సెర్చ్‌లోని ఏఐ మోడ్ ద్వారా సోషల్ మీడియాలో కనిపించిన కేఫ్, ప్రకృతి అందాలు లేదా పర్యాటక ప్రాంతం ఫొటోను అప్‌లోడ్ చేసి దాని వివరాలు తెలుసుకోవడంతోపాటు ప్రయాణ ప్రణాళికను రూపొందించుకోవచ్చు. జెమిని యాప్‌లో పర్సనల్ ఇంటెలిజెన్స్‌ను యాక్టివేట్ చేసి, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ ఫొటోస్ వంటి యాప్‌లను అనుసంధానం చేస్తే గత ప్రయాణాలు, వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా ప్రత్యేక ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. అలాగే గూగుల్ మ్యాప్స్‌లోని ఆస్క్ మ్యాప్స్ ద్వారా ప్రయాణించే మార్గంలో మంచి రెస్టారెంట్లు, భోజన కేంద్రాలు వంటి ప్రాంతాలను సంభాషణ రూపంలో తెలుసుకోవచ్చు. ఈ పరిణామాలు భారతీయ పర్యాటక రంగంలో వ్యక్తిగత అభిరుచులు, ఆరోగ్యం, సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
- ●Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?
- ●RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు
- ●CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు
- ●Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు
- ●Arunachal Karthigai Deepam | రాగి పాత్రలో అఖండ జ్యోతి.. అరుణాచల మహా దీపం వెనుక ఆసక్తికర విషయాలు!
- ●OU PhD Entrance Tests Schedule | ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ తేదీలు ఖరారు

Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?

RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు

CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు

Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు




