RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు
RERA | అల్పాదాయ వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రేరా ( RERA ) అనుమతులు లభించాయి.
హౌసింగ్ బోర్డు ప్రాజెక్టులకు తొలిసారిగా రేరా గుర్తింపు
ప్రభుత్వం ఇచ్చిన హామీలకు చట్టబద్దత
RERA | త్రినేత్ర న్యూస్ : అల్పాదాయ వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రేరా ( RERA ) అనుమతులు లభించాయి. రెరా ఛైర్మన్ శ్రీనివాసరాజు నుంచి ఈ అనుమతుల పత్రాలను హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ విపి గౌతం అందుకున్నారు. ప్రభుత్వం ద్వారా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు RERA అనుమతులు పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రాజెక్టు పనుల్లో పారదర్శకత, నిబంధనల ప్రకారం అమలు, లబ్ధిదారుల హక్కుల పరిరక్షణ పట్ల హౌసింగ్ బోర్డు చూపుతున్న నిబద్ధతకు ఈ అనుమతులు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగర పరిధిలో ఈ పథకం ద్వారా లక్ష ఇండ్లను నిర్మించాలని నిర్ణయించి, తొలి విడతలో పైలట్ ప్రాజెక్టుగా 20 నియోజకవర్గాల్లో సుమారు 12,000 ఇండ్ల నిర్మాణాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పరంగా భూములను ఉచితంగా అందచేయడంతోపాటు, సంబంధిత ప్రాజెక్టులో అవిభక్త భూమి వాటాను (un divided land share) కూడా రిజిస్టర్ చేసి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అన్నింటికి మించి ఏడాది లోగా నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలన్న ధృడ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నది.
ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇలాంటి హామీలన్నిటికీ చట్టబద్ధత కల్పిస్తూ, నిబద్దతతో, నియమిత కాలపరిమితిలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంపై ఇండ్ల లబ్ధిదారులకు సంపూర్ణ విశ్వాసం కలిగించడంలో రెరా అనుమతులు కీలకమైన భూమిక వహిస్తాయి. అంతే కాకుండా రెరా అనుమతులున్న ప్రాజెక్టులకు బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనట్లుగా హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ ప్రాజెక్టులన్నిటికీ RERA అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. తొలిదశలో మలక్‌పేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులకు RERA అనుమతులు మంజూరయ్యాయి.
బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 30-50 లక్షల విలువ చేసే ఈ ఫ్లాట్లను పేద ప్రజల కోసం కేవలం రూ.6 లక్షలకే ప్రభుత్వం అందచేస్తున్నందున, రెరా ఛైర్మన్ ప్రత్యేక చొరవ తీసుకుని అనుమతుల జారీని వేగవంతం చేశారు. ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టులకు RERA అనుమతులు పొందడం హౌసింగ్ బోర్డు చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి అని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ విపి గౌతం అన్నారు. RERA అనుమతుల ద్వారా ప్రాజెక్టులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని, గృహ నిర్మాణ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ హౌసింగ్ బోర్డు తన సేవలను కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?
- ●Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..
- ●CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు
- ●Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు
- ●Arunachal Karthigai Deepam | రాగి పాత్రలో అఖండ జ్యోతి.. అరుణాచల మహా దీపం వెనుక ఆసక్తికర విషయాలు!
- ●OU PhD Entrance Tests Schedule | ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్ తేదీలు ఖరారు

Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?

Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..

CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు

Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు





