Petrol Diesel Price Hike | ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వంతు.. లీటర్‌పై రూ.3 వాత
Petrol Diesel Price Hike | ఊహించినట్లే జరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Price Hike) పెరిగాయి. చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున వడ్డించాయి.
Petrol Diesel Price Hike | త్రినేత్ర.న్యూస్: ఊహించినట్లే జరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Price Hike) పెరిగాయి. చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున వడ్డించాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరింత భారం కానుంది.
తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.110.50కు చేరగా, డీజిల్ రూ.98.70కి పెరిగింది. ఇక ఢిల్లీలో పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67, కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.74, డీజిల్ రూ.95.13, ముంబైలో పెట్రోల్ రూ.106.68, డీజిల్ రూ.93.14, చెన్నైలో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.95.25గా ఉన్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల కాలంలో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మే 1న వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర (Commercial LPG Cylinder) ఏకంగా రూ.993 పెరిగిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లో రూ.3,315, ఢిల్లీలో రూ.3,071.50, కోల్‌కతాలో రూ.3202, ముంబైలో రూ.3024, చెన్నైలో రూ.3237కి చేరింది. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.196 పెరిగిన విషయం తెలిసింది. ఇక మార్చిలో రూ.114.50 పెరిగింది.
కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల సిలిండర్ ధర (Domestic LPG) పెరగకపోవడం వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చేదే. డొమెస్టిక్ సిలిండర్ ప్రస్తుతం రూ.965గా ఉన్నది. గత నెల రూ.60 పెరిగిన విషయం తెలిసిందే.
సీఎన్‌జీ కూడా
మరోవైపు సంకుచిత సహజ వాయువు(సీఎన్‌జీ) రేట్లు కూడా పెరిగాయి. ఢిల్లీతో పాటు ముంబైలోనూ కిలోకి రూ.2 పెంచారు. పెరిగిన ధరలతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.87కి చేరింది. అయితే మిగతా నగరాల్లో మాత్రం సీఎన్‌జీ రేట్లలో మార్పు కనిపించడం లేదు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




