Train Fire | తప్పిన ప్రాణనష్టం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం
Train Fire | బీహార్‌లోని (Bihar) సహర్సా జిల్లాలో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఓ ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి (Train Fire). దీంతో మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి.
Train Fire | త్రినేత్ర.న్యూస్: బీహార్‌లోని (Bihar) సహర్సా జిల్లాలో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఓ ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి (Train Fire). దీంతో మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ (నంబర్ 63344) రైలు (Passenger Train) సోమవారం తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో సిమ్రి బఖ్తియార్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. రైలు రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఉండగా.. ఇంజిన్ నుంచి పొగ, ఆ తర్వాత మంటలు రావడం (Fire Accident) ప్రారంభమయ్యాయి. అవి క్రమంగా పక్కనే ఉన్న బోగీలకు అంటుకున్నాయి. దీంతో స్టేషన్ మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. బోగీల్లో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

గమనించిన ప్రయాణికులు అంతా కింది దిగిపోయారు. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్‌పై స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
#Bihar सिमरी-बख्तियारपुर स्टेशन पर खड़ी मेमू ट्रेन में सोमवार की सुबह करीब 3 बजे आग लगने से अफरातफरी मच गई। यात्री ट्रेन की बोगी से कूदकर भागे।
आग की लपट इतनी तेज थी कि देखते ही देखते आग ने अगली बोगी को अपनी चपेट में ले लिया। इंजन सहित एक बोगी धू-धू कर जलकर खाक हो गई। घटना के… pic.twitter.com/LbOLGrmgIt
— Ashutosh Prasad (@ashukrpd) August 3, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stocks | ఎరోస్పేస్ రంగంలో దూసుకెళ్తున్న 3 కంపెనీలు.. భారీ రాబడులపై కన్నేసిన పెట్టుబడిదారులు..
- ●Assault | భార్యపై కోపంతో.. నాలుగేండ్ల కూతురిపై లైంగికదాడి..
- ●NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ
- ●Vivo S2 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన వివో ఎస్2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..
- ●Doctor Suspended | తనకు బదులు విధులకు మరో వ్యక్తి.. జోగిపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు
- ●Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్

Stocks | ఎరోస్పేస్ రంగంలో దూసుకెళ్తున్న 3 కంపెనీలు.. భారీ రాబడులపై కన్నేసిన పెట్టుబడిదారులు..

Assault | భార్యపై కోపంతో.. నాలుగేండ్ల కూతురిపై లైంగికదాడి..

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ చేసింది ఎన్టీఏ సబ్జెక్టు నిపుణులే.. గుట్టు విప్పిన సీబీఐ

Vivo S2 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన వివో ఎస్2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..






