త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiren Rijiju | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియలేదు : కిర‌ణ్ రిజిజు

Kiren Rijiju | పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల‌పై పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) హింట్ ఇచ్చారు. లోక్‌సభ, రాజ్యసభలు నిరవధిక వాయిదా పడినప్పటికీ, సెషన్‌ను రాష్ట్రపతి ఇంకా అధికారికంగా ముగించలేదని (ప్రోరోగ్ చేయలేదని) స్ప‌ష్టం చేశారు. ప్రోరోగ్ (prorogued) చేయ‌కుండానే తిరిగి స‌మావేశ‌ప‌రిచిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయ‌ని ఈ సందర్భాలు గుర్తు చేశారు.

D

National | Published On Aug 27, 2026, 4.40 pm IST

Kiren Rijiju | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియలేదు : కిర‌ణ్ రిజిజు
Advertisement

Kiren Rijiju | త్రినేత్ర‌.న్యూస్ : పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాలు (Parliament Special Session) నిర్వ‌హించే అవ‌కాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న వేళ కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju) చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా (Adjourned sine die) పడినప్పటికీ.. అధికారికంగా ముగియలేదని (ప్రోరోగ్ కాలేదని) తెలిపారు. ఉన్న సెష‌న్‌ను అధికారికంగా ముగించ‌కుండానే స‌భ‌ను మ‌ళ్లీ స‌మావేశ‌ప‌ర్చొచ్చ‌ని తెలిపారు.

ఢిల్లీలో నిర్వ‌హించిన ఓ ఇంట‌ర్వ్యూలో రిజుజు మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభలు నిరవధిక వాయిదా పడినప్పటికీ, సెషన్‌ను రాష్ట్రపతి ఇంకా అధికారికంగా ముగించలేదని స్ప‌ష్టం చేశారు. 1952 నుంచి పార్లమెంటును ప్రోరోగ్ చేయ‌కుండానే తిరిగి స‌మావేశ‌ప‌రిచిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయ‌ని ఈ సందర్భాలు గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలో ప్రత్యేక సమావేశం గురించి అడగ్గా కేంద్ర మంత్రి నేరుగా జవాబివ్వలేదు. పార్ల‌మెంటును ఎప్పుడు స‌మావేశ‌ప‌ర‌చాల‌నేది పూర్తిగా ప్ర‌భుత్వ నిర్ణ‌యం అని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర‌ప‌తి అనుమ‌తితో పార్ల‌మెంటు స‌మావేశాల‌ను మ‌ళ్లీ నిర్వ‌హించొచ్చ‌ని వివ‌రించారు.

సమయం వచ్చినప్పుడు దీనిపై స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. రిజుజు వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌త్యేక సమావేశాల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని ప్ర‌భుత్వం డీలిమిటేష‌న్, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లుల కోసం స‌భ‌ను మ‌ళ్లీ స‌మావేశ‌ప‌రిచే అవ‌కాశం ఉంద‌న్న ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాగా, పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు జులై 20న ప్రారంభ‌మై ఆగ‌స్టు 13న ముగిశాయి. రామమందిర విరాళాల చోరీ, నీట్ పేప‌ర్ లీక్ ఆందోళ‌న‌ల సంద‌ర్భంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌, పెల్లెట్ గ‌న్స్ వాడ‌టంపై విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆయా అంశాల‌పై ప్ర‌తిప‌క్ష ఎంపీలంతా పార్ల‌మెంట్ లోప‌లా, బ‌య‌ట త‌మ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగించారు. విప‌క్షాల నిర‌స‌ల‌న‌తో 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు ఎలాంటి అర్థవంతమైన చర్చలూ లేకుండా ఉభ‌య స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి. ఇక ఈ స‌మావేశాల్లో మొత్తం 12 బిల్లులకు ఆమోదం ల‌భించింది. పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అక్రమాలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు తెచ్చిన 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'పైనే (Public Examinations Amendment Bill 2026) మాత్ర‌మే చ‌ర్చ జ‌రిగింది.

Also Read..

నేపాల్ వ‌ర‌ద‌ల్లో 288 మంది భార‌తీయులు గ‌ల్లంతు : విదేశాంగ శాఖ‌

న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 52 వారాల క‌నిష్టానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్‌..

అనుముల కాదు! ఆయ‌న‌ ఆంధ్రా రేవంత్‌రెడ్డి.. అందుకే బ్రాహ్మ‌ణ‌ పరిషత్ ఛైర్మన్ ప‌ద‌వి శ్రీనివాసరావుకు క‌ట్ట‌బెట్టిండు

Advertisement
Advertisement