Parliament Proceedings in Local Languages | పార్లమెంట్‌లో ప్రాంతీయ భాషలు.. వచ్చే పార్లమెంట్ సమావేశాల నుంచి అమలు
డిజిటల్ సంసద్ యాప్ ద్వారా అన్ని రాష్ట్రాల బడ్జెట్ ప్రతులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, 2027 నాటికి ప్రతి భాషలో పార్లమెంట్ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
Parliament Proceedings in Local Languages | లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్‌కి సంబంధించి కీలక ప్రక్రియను వెల్లడించారు. 2027 నాటికి పార్లమెంట్ కార్యకలాపాలన్నీ రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న 22 అధికారిక భాషల్లో అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ఇందులో భాగంగా ఎంపీలు తమ సొంత భాషల్లో మాట్లాడే వెసులుబాటు ఇప్పటికే ఉన్నా.. రాబోయే సమావేశాల నుంచి అన్ని భాషల అనువాదాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొస్తామని తెలిపారు.
డిజిటల్ సంసద్ యాప్ ద్వారా అన్ని రాష్ట్రాల బడ్జెట్ ప్రతులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, 2027 నాటికి ప్రతి భాషలో పార్లమెంట్ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
ఆగస్టు 2025 లో కశ్మీరీ, కొంకణి, సంతాలీ భాషలను చేర్చడంతో మొత్తం 22 భాషలకు అనువాద సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. పార్లమెంట్‌లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత కల్పించే ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా గతంలో ప్రశంసించిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




