త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | దేవుళ్ల‌పై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమ‌లుచేయ‌కుండా నాట‌కాలు.. సీఎం రేవంత్‌పై కిష‌న్ రెడ్డి ఫైర్‌

Kishan Reddy | దేవుళ్ల పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను అందరూ చీదరించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) విమ‌ర్శించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా శివుడు, శ్రీరాముడిని వేరు చేస్తూ స‌మాజంలో విభ‌జ‌న తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G

Telangana | Published On Oct 1, 2026, 1.08 pm IST

Kishan Reddy | దేవుళ్ల‌పై అవాకులుచెవాకులు.. గ్యారంటీలు అమ‌లుచేయ‌కుండా నాట‌కాలు.. సీఎం రేవంత్‌పై కిష‌న్ రెడ్డి ఫైర్‌
Advertisement

Kishan Reddy | త్రినేత్ర న్యూస్‌: దేవుళ్ల పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను అందరూ చీదరించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) విమ‌ర్శించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా శివుడు, శ్రీరాముడిని వేరు చేస్తూ స‌మాజంలో విభ‌జ‌న తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల హామీల (Election Promises) గురించి అడిగితే కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారని మండిప‌డ్డారు. హిందు దేవుళ్లపై మాట్లాడితే ప్రజల మద్దతు రాదని, హామీలు అమలు చేసి మంచి పాలన అందిస్తేనే అది సాధ్య‌మ‌న్నారు. మతం, కులం, ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించడం కాంగ్రెస్‌కు (Congress) అలవాటేనని విమర్శించారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు అమలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారు విమ‌ర్శించారు. ప్రజలు హామీల అమలు గురించి ప్రశ్నిస్తుండటంతో, వారి దృష్టిని మళ్లించడానికి కొత్త వివాదాలను తెరపైకి తెస్తూ నాటకాలాడటం మొదలుపెట్టారని ధ్వ‌జ‌మెత్తారు. ఇందులో భాగంగానే దేవుళ్ళపై (Hindu Gods) అవాకులుచెవాకులు మాట్లాడుతున్నారు మండిప‌డ్డారు. తన అవసరాల కోసం ఏ గడ్డి తినడానికి అయినా వెనుకాడరని, గతంలో కేసీఆర్ (KCR) ఆడిన నాటకాలే రేవంత్ ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. తన వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీఎం రేవంత్ హిందువులంటే చులకనగా మాట్లాడుతున్నారని, ఇతర మతాలపై అలా మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించారు. హిందూ దేవుళ్ల‌ను అవ‌మానించేలా మాట్లాడితే ప్ర‌జ‌లు స‌హించ‌ర‌ని, త‌గిన బుద్ధి చెబుతార‌ని హెచ్చ‌రించారు. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మెప్పుకోసమే రేవంత్‌ అలా మాట్లాడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. సోనియా కుటుంబానికి తాను బానిస అని, ఆ కుటుంబం కోసం ప్రాణ త్యాగం చేస్తానని రేవంత్ అంటున్నార‌ని విమ‌ర్శించారు.

Advertisement
Advertisement