త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kumkum Mohod | రిక‌ర్వ్ ఆర్చ‌రీలో భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం.. ఆసియా క్రీడ‌ల్లో కుమ్‌కుమ్ స‌రికొత్త చ‌రిత్ర

Kumkum Mohod | ఆసియా క్రీడ‌ల్లో భార‌త‌ ఆర్చ‌ర్ల హ‌వా కొన‌సాగుతున్న‌ది. మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త రిక‌ర్వ్ ఆర్చ‌రీలో (Recurve Archery) టీనేజ‌ర్ కుమ్‌కుమ్ మొహ‌ద్ (Kumkum Mohod) స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది.

G

Sports | Published On Oct 3, 2026, 8.13 am IST

Kumkum Mohod | రిక‌ర్వ్ ఆర్చ‌రీలో భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం.. ఆసియా క్రీడ‌ల్లో కుమ్‌కుమ్ స‌రికొత్త చ‌రిత్ర
Advertisement

Kumkum Mohod | త్రినేత్ర న్యూస్‌: ఆసియా క్రీడ‌ల్లో భార‌త‌ ఆర్చ‌ర్ల హ‌వా కొన‌సాగుతున్న‌ది. మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త రిక‌ర్వ్ ఆర్చ‌రీలో (Recurve Archery) టీనేజ‌ర్ కుమ్‌కుమ్ మొహ‌ద్ (Kumkum Mohod) స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. వ్య‌క్తిగ‌త రిక‌ర్వ్ ఫైన‌ల్‌లో కొరియా ఆర్చ‌ర్‌తో ఓహ్ యెజిన్‌తో హోరాహోరీగా త‌ల‌ప‌డిన కుమ్‌కుమ్‌.. 5-6 తేడాతో ఆమెను ఓడించింది. దీంతో ఈ విభాగంలో (Individual Recurve Medal) ప‌త‌కం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా రికార్డు లిఖించ‌డ‌మే కాకుండా, బంగారు ప‌త‌కం (Gold Medal) అందుకున్న క్రీడాకారినిగా నిలిచింది. టోర్నీలో అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న కుమ్‌కుమ్‌.. ఈ చారిత్రాత్మక విజ‌యంతో లాస్ ఏంజిల్స్‌లో జ‌రుగ‌నున్న‌ ఒలింపిక్స్‌కు (Olympic Game) భారత్ తరఫున అర్హత సాధించింది.

దీంతో ఆసియా క్రీడ‌ల (Asian Games) ప‌తకాల ప‌ట్టిక‌లో భార‌త్ ప్ర‌స్తుతం ఐదో స్థానంలో కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టివ‌రకు 16 బంగారు ప‌త‌కాలు, 25 ర‌జ‌తాలు, 35 కాంస్యాలలతో మొత్తం 76 ప‌త‌కాలు సాధించింది. కాగా, 316 ప‌త‌కాలతో చైనా (162 స్వ‌ర్ణం, 81 ర‌జ‌తం, 73 కాంస్యం), 240 మెడ‌ల్స్‌తో జ‌పాన్ (72 స్వ‌ర్ణం, 83 ర‌జ‌తం, 85 కాంస్యం), 134 ప‌త‌కాల‌తో ద‌క్షిణ కొరియా (33 స్వ‌ర్జాలు, 39 ర‌జ‌తం, 62 కాంస్యం), 65 ప‌త‌కాల‌తో ఉజ్బెకిస్థాన్ (20 స్వ‌ర్ణం, 23 ర‌జ‌తం, 22 కాంస్యం) తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.

Advertisement
Advertisement