త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu | త‌మిళ‌నాడులో హైవే బోర్డుల‌పై హిందీ.. ఇద్ద‌రు అధికారుల స‌స్పెండ్‌

Tamil Nadu | త‌మిళ‌నాడులోని హైవేల‌పై ఉన్న బోర్డుల‌పై హిందీ భాష క‌నిపించ‌డం తీవ్ర వివాదానికి కేంద్ర‌బిందువుగా మారింది. స‌తంకులం -న‌జ‌ర‌త్ రాష్ట్ర ర‌హదారిపై నూత‌నంగా ఏర్పాటు చేసిన బోర్డ‌ల‌లో హిందీ భాష‌లో సైతం సూచ‌న‌లు ఉంచారు.

S

National | Published On Oct 2, 2026, 8.53 pm IST

Tamil Nadu | త‌మిళ‌నాడులో హైవే బోర్డుల‌పై హిందీ.. ఇద్ద‌రు అధికారుల స‌స్పెండ్‌
Advertisement

Tamil Nadu | త్రినేత్ర న్యూస్ : త‌మిళ‌నాడులోని హైవేల‌పై ఉన్న బోర్డుల‌పై హిందీ భాష క‌నిపించ‌డం తీవ్ర వివాదానికి కేంద్ర‌బిందువుగా మారింది. స‌తంకులం -న‌జ‌ర‌త్ రాష్ట్ర ర‌హదారిపై నూత‌నంగా ఏర్పాటు చేసిన బోర్డ‌ల‌లో హిందీ భాష‌లో సైతం సూచ‌న‌లు ఉంచారు. దీనిపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిప‌డ్డారు. త‌మిళుల‌పై హిందీ భాష‌ను రుద్దాల‌ని కేంద్రం చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో ఇది భాగ‌మేన‌ని ఆరోపించారు. దీనికి వెంట‌నే స్పందించిన విజ‌య్ ప్ర‌భుత్వం త‌మిళం, ఇంగ్లీష్ రెండు భాష‌ల విధానాన్ని ఈ చ‌ర్య ఉల్లంఘించ‌డ‌మేన‌ని, ఇలాంటివి స‌హించ‌బోమ‌ని హెచ్చ‌రించింది. దీనికి బాధ్యులైన త‌మిళ‌నాడు ర‌హ‌దారుల శాఖ‌కు చెందిన ఇద్ద‌రు అధికారుల‌ను స‌స్పెండ్ చేసింది. స‌దరు బోర్డుల‌పై హిందీ భాష‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఆదేశించింది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement