Padma Awards 2026 | పద్మ పురస్కారాలు 2026: టాలీవుడ్ సీనియర్లకు ‘పద్మశ్రీ’.. మమ్ముట్టి, అల్కా యాగ్నిక్‌లకు ‘పద్మభూషణ్’
ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన 2026 పద్మ పురస్కారాల ప్రదానోత్సవం. తెలుగు సినీ దిగ్గజాలు మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్‌లకు పద్మశ్రీ, మమ్ముట్టికి పద్మభూషణ్.
- రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2026 పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం
- టాలీవుడ్ సీనియర్ నటులు గద్దె రాజేంద్రప్రసాద్, మాగంటి మురళీ మోహన్‌లకు పద్మశ్రీ అవార్డుల ప్రదానం
- మలయాళ స్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ సింగర్ అల్కా యాగ్నిక్‌లకు పద్మభూషణ్
- నటుడు ఆర్.మాధవన్‌కు పద్మశ్రీ.. దివంగత నటుడు సతీష్ షాకు మరణానంతరం పద్మశ్రీ పురస్కారం
Padma Awards 2026 | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల (Padma Awards 2026) రెండో విడత ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. సినిమా, సంగీతం, కళలు, ప్రజా సేవ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా సత్కరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక వేడుకకు హాజరయ్యారు.
టాలీవుడ్ సీనియర్లకు దక్కిన గౌరవం
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సీనియర్ నటులు, 'హాస్య బ్రహ్మ' గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), మాగంటి మురళీ మోహన్ (Murali Mohan) లను ప్రతిష్టాత్మక పద్మశ్రీ (Padma Shri) అవార్డులు వరించాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఇద్దరు టాలీవుడ్ దిగ్గజాలు అవార్డులు అందుకున్నారు.

మమ్ముట్టికి పద్మభూషణ్.. మురిసిపోయిన దుల్కర్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ (Padma Bhushan) దక్కింది. ఐదు దశాబ్దాలుగా 400లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన.. సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుంటారు. మమ్ముట్టి ఈ అవార్డు అందుకుంటున్నప్పుడు ఆయన కొడుకు, పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ అక్కడే ఉండి తండ్రిని చూసి ఎంతో మురిసిపోయారు.


అలాగే, నాలుగు దశాబ్దాలుగా వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ప్రఖ్యాత గాయని అల్కా యాగ్నిక్ (Alka Yagnik) కూడా పద్మభూషణ్ అందుకున్నారు.

మాధవన్, సతీష్ షా సహా పలువురికి పద్మశ్రీ
విలక్షణ నటుడు, ఫిల్మ్ మేకర్ ఆర్. మాధవన్‌కు (R Madhavan) భారతీయ సినిమాకు చేసిన సేవలకు గానూ పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో టీవీ, సినిమాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత నటుడు సతీష్ షాకు మరణానంతరం పద్మశ్రీ ప్రదానం చేశారు.

వీరితో పాటు థియేటర్, సినిమా, టీవీ రంగాల్లో సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన సీనియర్ నటుడు, శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ రస్తోగి, నాగాలాండ్‌కు చెందిన జానపద కళాకారుడు గురు సంగ్యుసాంగ్ పొంగెనెర్ కూడా పద్మశ్రీ సత్కారాన్ని అందుకున్నారు.

కాగా, ఇటీవల జరిగిన తొలి విడత ప్రదానోత్సవంలో దివంగత బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, బెంగాలీ నటుడు ప్రసేన్‌జిత్ ఛటర్జీ, థియేటర్ ఆర్టిస్ట్ అరవింద్ వైద్యలకు పద్మ అవార్డులను ప్రదానం చేసిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Padma Awards 2026 | నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రెసిడెంట్
జూన్ 23, 2026

Padma Awards | నేడు పద్మ పురస్కారాల ప్రదానం.. తెలంగాణ నుంచి వీరికే..
మే 25, 2026

Padma Awards 2026 Full List | 2026 పద్మ పురస్కారాల పూర్తి జాబితా: 131 మంది ప్రముఖులకు అత్యున్నత గౌరవం!
జనవరి 25, 2026
తాజావార్తలు
- ●Himayat Sagar | హిమాయత్ సాగర్‌కు పోటెత్తిన వరద.. అప్రమత్తమైన జలమండలి
- ●Rains | పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు.. రాత్రి పూట మోస్తరు వర్షాలు
- ●Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా
- ●Trisha | దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా? బ్రేకప్ నిజమేనా ? అసలు ట్విస్ట్ ఇదే!
- ●KTR | మరో భారీ కుంభకోణం.. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను : కేటీఆర్
- ●Chanagani Dayakar | బాహుబలిని ఓడించే సత్తా కేటీఆర్‌కు లేదు : చనగాని దయాకర్

Himayat Sagar | హిమాయత్ సాగర్‌కు పోటెత్తిన వరద.. అప్రమత్తమైన జలమండలి

Rains | పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు.. రాత్రి పూట మోస్తరు వర్షాలు

Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా

Trisha | దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా? బ్రేకప్ నిజమేనా ? అసలు ట్విస్ట్ ఇదే!



