త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మ‌రో భారీ కుంభ‌కోణం.. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తుల‌పై రేవంత్ రెడ్డి క‌న్ను : కేటీఆర్

KTR | హైదరాబాద్ మెట్రో రైల్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపైన రేవంత్ రెడ్డి కన్ను ప‌డింద‌ని ఆరోపించారు. రూ. 30 వేల కోట్ల ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అనుచరులకు అప్పజెప్పే భారీ కుంభకోణం జ‌రుగుతుంద‌న్నారు.

S

Telangana | Published On Jun 23, 2026, 6.29 pm IST

KTR | మ‌రో భారీ కుంభ‌కోణం.. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తుల‌పై రేవంత్ రెడ్డి క‌న్ను : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్ మెట్రో రైల్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపైన రేవంత్ రెడ్డి కన్ను ప‌డింద‌ని ఆరోపించారు. రూ. 30 వేల కోట్ల ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అనుచరులకు అప్పజెప్పే భారీ కుంభకోణం జ‌రుగుతుంద‌న్నారు. అందుకే మెట్రో రైల్ ఎల్ అండ్ టీ అధికారులను బ్లాక్‌మెయిల్ చేసి వారిని రాష్ట్రం నుంచి తన్ని తరిమేశారు. అందుకే రూ. 14,000 కోట్ల ఎల్ అండ్ టీ అప్పును రాష్ట్ర ప్రజలపై రేవంత్ రెడ్డి రుద్దుతున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ స‌మావేశంలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి హైదరాబాద్ మెట్రో అంశంలో డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఏదో తీసుకువచ్చినట్లు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో అడ్డగోలుగా విమర్శలు చేసుకొని, ఢిల్లీలో కలిసినట్లు నాటకాలు ఆడుతూ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కానీ ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు చేసిన రేవంత్ రెడ్డిని, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కిషన్ రెడ్డిని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై 14 వేల కోట్ల అప్పు

రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో పైన ఉన్న దగ్గర ఉన్న 250 ఎకరాల భూములను తన సొంత అన్నదమ్ములకు, బావమరిదికి, కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారన్నారు. కేవలం మెట్రో దగ్గర ఉన్న 30 వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఆస్తుల పైన కన్నేసి, మెట్రో రైల్ ఎల్ అండ్ టీ అధికారులను బ్లాక్‌మెయిల్ చేసి వారిని రాష్ట్రం నుంచి తన్ని తరిమేశారన్నారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం మెట్రో వేల కోట్ల ఆస్తుల కోసం ప్రైవేట్ సంస్థ అయిన ఎల్ అండ్ టీ 14 వేల కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రజల మీద రేవంత్ రెడ్డి రుద్దుతున్నారన్నారు.

మెట్రో రైల్ పేరుతో మ‌రో భారీ కుంభ‌కోణం

ఎల్ అండ్ టీ కట్టవలసిన అప్పును ఇయ్యాల రాష్ట్ర ప్రభుత్వం కడతామని చెప్పి, మెట్రో రైళ్లను దివాళా తీయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మెట్రోపైన ప్రేమ ఉన్నట్లు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నం వెనుక ఒక్క భారీ కుంభకోణం ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు. మేము ప్రతిసారి రేవంత్ రెడ్డి చేసే కుంభకోణం గురించి ముందే, కుంభకోణాల గురించి ముందే చెప్తూ వస్తున్నామని, ఈసారి కూడా మెట్రో రైలు పేరుతోని రేవంత్ రెడ్డి చేయబోతున్న కుంభకోణం గురించి స్పష్టంగా ప్రజలను అలర్ట్ చేస్తున్నామన్నారు. ఖచ్చితంగా మెట్రో దగ్గర ఉన్న 30 వేల కోట్ల రూపాయల విలువైన భూములను భవిష్యత్తులో ఎవరు కొంటారు, ఎవరు అమ్ముతారు, అవన్నీ చివరికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఎలా చేరుతాయో, అన్ని ప్రజల ముందుకు వస్తాయన్నారు.

ప‌టాన్‌చెరు వ‌ర‌కు ప్ర‌తిపాదిస్తే ఎందుకు ఆమోదం తెలుప‌లేదు..?

నిజంగానే కిషన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు చేస్తున్నది డ్రామా కాకుంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్ నుంచి మెట్రో ప‌టాన్‌చెరు వరకు ప్రతిపాదిస్తే ఎందుకు బీజేపీ ఆమోదం తెలపలేదన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చిన్న చిన్న మెట్రో నగరాలకు మెట్రో ప్రాజెక్టులు అపనంగా ఇచ్చిన కేంద్రం ఎందుకు తెలంగాణకు మద్దతుగా నిలవలేదన్నారు. దీనితో పాటు అత్యధిక జనసాంద్రత కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు ఎలాంటి భూసేకరణ లేకుండా మెట్రో రైల్ ప్రాజెక్టుని శంకుస్థాపన చేస్తే, రేవంత్ రెడ్డి వచ్చి దానిని వెంటనే రద్దు చేశారన్నారు.

మెట్రో ప్రాజెక్టు మరోసారి ప‌ట్టాలు ఎక్కాలంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందే..

గత ప్రభుత్వ ప్రణాళికల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి అయ్యేదని, లక్షల మంది ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు తప్పేవని కేటీఆర్ అన్నారు. కేవలం రేవంత్ రెడ్డికి ఆలోచన లేక, పరిపాలన ప్రాధాన్యతలు తెలయక మెట్రో రైల్ ప్రాజెక్టును రద్దు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి వదిలేసిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుని 70 శాతానికిపైగా కేసీఆర్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ఎన్ని డ్రామాలు ఆడినా ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్టు మరోసారి పట్టాలు ఎక్కాలి అంటే, ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాల్సిందే అని కేటీఆర్ అన్నారు.

Advertisement
Advertisement