Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా
టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ నిర్మాతగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఇడుపు కాయిదం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఫోక్ సింగర్ కమ్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Jun 23, 2026, 7.03 pm IST
Sukumar | ప్రియదర్శి హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో తెలుగులో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ రాబోతుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో వంశీరెడ్డి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫోక్ సింగర్ కమ్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిన్న సినిమాను బన్నీవాస్‌తో కలిసి సుకుమార్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు.
తెలంగాణ యాస...భాషలతో...
కాగా సుకుమార్, ప్రియదర్శి సినిమాకు ఇడుపు కాయిదం అనే టైటిల్ మేకర్స్ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. టైటిల్ చూస్తుంటే విడాకుల నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు కనిపిస్తోంది. కంప్లీట్ తెలంగాణ యాస, భాషలతో పాటు ఇక్కడి సంస్కృతికి ప్రాధాన్యమిస్తూ సినిమా రూపొందుతోన్నట్లు సమాచారం. గురువారం అఫీషియల్‌గా లాంఛ్ కానుంది.
అప్పుడు కమెడియన్...
సుకుమార్ బ్యానర్‌లో గతంలో వచ్చిన దర్శకుడుతో పాటు మరికొన్ని సినిమాల్లో ప్రియదర్శి కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. ఇప్పుడు అదే బ్యానర్‌లో హీరోగా సినిమా చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది.
బలగం తర్వాత హీరోగా ప్రియదర్శి చాలానే సినిమాలు చేశాడు. కానీ ఇవేవీ అతడికి విజయాలను తెచ్చిపెట్టలేకపోయాయి. సుకుమార్ సినిమాతోనైనా ప్రియదర్శి సక్సెస్ బాట పడతాడో? లేదో? అన్నది ఆసక్తికరంగా మారింది. సేవ్ ది టైగర్స్ 3 వెబ్‌సిరీస్‌తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించాడు ప్రియదర్శి. ఈ కామెడీ సిరీస్‌లో ప్రియదర్శితో పాటు అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో నటించాడు. జియో హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత వార్తలు

Mrunal Thakur | కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్ ఠాకూర్ – కల నిజమైందంటూ ఎమోషనల్ పోస్ట్
జూన్ 23, 2026

Samantha | చిరు లీక్స్ – సమంత జీవితంలోని గుడ్ న్యూస్‌ను బయటపెట్టిన మెగాస్టార్
జూన్ 23, 2026

Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా “ఏ” సర్టిఫికెట్ ఇచ్చారు – సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●Telangana Secretariat Job Fraud | సచివాలయంలో జాబ్.. 'తెల్ల చొక్కా'తో వస్తేనే ఇంటర్వ్యూ! ఎస్పీఎఫ్ పోలీసులకు అడ్డంగా బుక్కైన నకిలీ అధికారి
- ●Samantha | సమంత మాస్ ర్యాంపేజ్ - యాభై కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం - నాలుగు రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతంటే?
- ●Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్న : హరీశ్‌రావు
- ●Ketan Agarwal Murder Case | అవును.. నేనే లోయలోకి తోసి చంపేశా.. తప్పు ఒప్పుకున్న పుణే యువతి సియా
- ●ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గాంధీనగర్ ఎస్ఐ
- ●Himayat Sagar | హిమాయత్ సాగర్‌కు పోటెత్తిన వరద.. అప్రమత్తమైన జలమండలి

Telangana Secretariat Job Fraud | సచివాలయంలో జాబ్.. 'తెల్ల చొక్కా'తో వస్తేనే ఇంటర్వ్యూ! ఎస్పీఎఫ్ పోలీసులకు అడ్డంగా బుక్కైన నకిలీ అధికారి

Samantha | సమంత మాస్ ర్యాంపేజ్ - యాభై కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం - నాలుగు రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతంటే?

Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్న : హరీశ్‌రావు

Ketan Agarwal Murder Case | అవును.. నేనే లోయలోకి తోసి చంపేశా.. తప్పు ఒప్పుకున్న పుణే యువతి సియా



