త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | ద‌ళ‌ప‌తి విజ‌య్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా? బ్రేక‌ప్ నిజ‌మేనా ? అస‌లు ట్విస్ట్ ఇదే!

త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చెన్నై క్వీన్ త్రిష విషెస్ చెప్ప‌క‌పోవ‌డం నెట్టింట వైర‌ల్‌గా మారింది. విజ‌య్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష అన్‌ఫాలో చేసింద‌ని, ఇద్ద‌రి బంధానికి బ్రేక‌ప్ ప‌డింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల వెనుక ఉన్న అస‌లు ట్విస్ట్ ఏంటంటే?

N

Entertainment | Published On Jun 23, 2026, 6.31 pm IST

Trisha  | ద‌ళ‌ప‌తి విజ‌య్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా?  బ్రేక‌ప్ నిజ‌మేనా ? అస‌లు ట్విస్ట్ ఇదే!
Advertisement

Trisha |  త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ పుట్టిన‌రోజు వేళ మ‌రోసారి త్రిష పేరు హాట్ టాపిక్ గా మారింది. విజ‌య్‌, త్రిష ప్రేమ‌లో ఉన్న‌ట్లు పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు త‌మిళ‌నాట చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌య్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వేడుక‌కు త్రిష స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. త‌మిళ‌ ప్రొడ్యూస‌ర్ కొడుకు పెళ్లికి త్రిష‌తోనే విజ‌య్ అటెండ్ అయ్యారు. ఇటీవ‌ల అజిత్ ఇంటికి ఇద్ద‌రూ జంట‌గానే వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

త్రిష సైలెంట్‌...

కాగా సోమ‌వారం ద‌ళ‌ప‌తి విజ‌య్ 52వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్నారు. గ‌త కొన్నేళ్లుగా విజ‌య్ ప్ర‌తి పుట్టిన‌రోజుకు త్రిష స్పెష‌ల్‌గా విషెస్ చెబుతూ వ‌చ్చింది. గ‌తంలో ఈ కోలీవుడ్ హీరో బ‌ర్త్‌డే రోజు త్రిష చేసిన పోస్ట్‌లు వైర‌ల్ అయ్యాయి. ఈ సారి కూడా ఆమె ఎలా విషెస్‌ చెబుతుందోన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. కానీ త్రిష మాత్రం శుభాకాంక్ష‌లు చెప్ప‌కుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఎలాంటి ట్వీట్‌, పోస్ట్‌లు పెట్ట‌లేదు. త్రిష మౌనం నెట్టింట‌ వైర‌ల్‌గా మారింది. విజ‌య్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష అన్‌ఫాలో చేసింద‌ని, ఇద్ద‌రికి బంధానికి బ్రేక‌ప్ ప‌డిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అవ‌న్నీ అబ‌ద్దాలే...

అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ట‌. అస‌లు ద‌ళ‌ప‌తి విజ‌య్‌ని త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఫాలో కాలేదు. విజ‌య్ గురించి త్రిష చాలానే పోస్ట్‌లు పెట్టింది. కానీ అత‌డిని ఫాలోవ‌ర్స్ లిస్ట్‌లో మాత్రం లేదు. ఫాలోనే కాన‌ప్పుడు అన్‌ఫాలో ఎలా చేస్తుంద‌ని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. మ‌రోవైపు విజ‌య్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 18 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అత‌డు  త్రిష‌నే కాదు ఎవ‌రిని ఫాలో కావ‌డం లేదు. మ‌రోవైపు విజ‌య్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను అత‌డి టీమ్ మెయింటేన్ చేస్తున్నారు.

విడాకుల త‌ర్వాతే...

విజ‌య్‌, త్రిష బ్రేక‌ప్ వార్త‌లు కూడా అబ‌ద్ద‌మేన‌ట‌. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధంలో ఎలాంటి మార్పు రాలేద‌ని స‌మాచారం. విజ‌య్‌, సంగీత విడాకుల కేసు విచార‌ణ ఆగ‌స్ట్ 7కు వాయిదాప‌డింది. ఈ విడాకుల కేసుపై ఆ రోజు తుది నిర్ణ‌యం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. విడాకుల కేసు త‌ర్వాతే త్రిష‌తో బంధంపై విజ‌య్‌ అఫీషియ‌ల్‌గా క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. పెళ్లి ప్ర‌క‌ట‌న రావ‌చ్చున‌ని టాక్ వినిపిస్తోంది. విజ‌య్‌, త్రిష ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సినిమాలు చేశారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో చివ‌ర‌గా లియో మూవీ వ‌చ్చింది.

 

Advertisement
Advertisement