త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengal refinery | హ‌ల్దియా రిఫైన‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం.. 20 మందికి గాయాలు.. రైలు స‌ర్వీసుల‌కు అంత‌రాయం

Bengal refinery | బెంగాల్‌లోని (Bengal refinery) హ‌ల్దియా రిఫైన‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం (fire breaks) సంభ‌వించింది. నాఫ్తా పైప్‌లైన్‌లో (naphtha pipeline) మంట‌లు చెల‌రేగ‌డంతో 20 మంది కార్మికులు గాయ‌ప‌డ్డారు. అగ్నిప్ర‌మాదం కార‌ణంగా స‌మీపంలోని రైల్వే ఓవ‌ర్ హెడ్ ప‌రిక‌రాలు కాలి బూడిద‌య్యాయి. ఫ‌లితంగా రైలు స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

D

National | Published On Jun 30, 2026, 12.08 pm IST

Bengal refinery | హ‌ల్దియా రిఫైన‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం.. 20 మందికి గాయాలు.. రైలు స‌ర్వీసుల‌కు అంత‌రాయం
Advertisement

Bengal refinery | ప‌శ్చిమ బెంగాల్‌లో భారీ (Bengal refinery) అగ్నిప్ర‌మాదం (fire breaks) సంభ‌వించింది. పూర్బా మేదినీపూర్ (Purba Medinipur) జిల్లాలో ఉన్న హ‌ల్దియా రిఫైన‌రీ (Haldia Refinery)లో నాఫ్తా పైప్‌లైన్‌లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 20 మందికిపైగా కార్మికులు గాయ‌ప‌డ్డారు.

తెల్ల‌వారుజామున 4-4:30 గంట‌ల మ‌ధ్య మంట‌లు చెల‌రేగిన‌ట్లు అధికారులు తెలిపారు. క్ష‌ణాల్లోనే మంట‌లు ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపించిన‌ట్లు చెప్పారు. ఈ ప్ర‌మాదంలో 20 మందికిపైగా కార్మికులు గాయ‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించారు. క్ష‌త‌గాత్రుల్లో స్థానికులే ఎక్కువ మంది అని చెప్పారు. వారిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని.. వారిని మెరుగైన చికిత్స కోసం కోల్‌క‌తాలోని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. గాయ‌ప‌డ్డ వారిలో రిఫైన‌రీ సంస్థ‌కు చెందిన ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బంది కూడా ఉన్నట్లు చెప్పారు.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 12 ఫైర్ ఇంజిన్ల‌తో మంట‌ల‌ను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మంట‌లు పెద్ద ఎత్తున ఎగ‌సిప‌డుతుండ‌టంతో ఆ ప్రాంతంలో ద‌ట్ట‌మైన పొగ క‌మ్మేసింది. కాగా, నాఫ్తా స‌ర‌ఫ‌రాకు ఉప‌యోగించే పైప్‌లైన్ లీకేజీ కావ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి ద‌ర్యాప్తు అనంత‌రం ప్ర‌మాదానికి గ‌ల క‌చ్చిత‌మైన కార‌ణాలు తెలుస్తాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఇక ఈ అగ్నిప్ర‌మాదం కార‌ణంగా స‌మీపంలోని రైల్వే ఓవ‌ర్ హెడ్ ప‌రిక‌రాలు కాలి బూడిద‌య్యాయి. ఫ‌లితంగా రైలు స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

Advertisement
Advertisement