త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heater | మ‌హిళ‌ ప్రాణాన్ని బ‌లిగొన్న‌ హీట‌ర్..

Heater | హీట‌ర్( Heater ) ఓ మ‌హిళ‌ ప్రాణాన్ని బ‌లిగొన్న‌ది. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ బోర‌బండ‌( Borabanda )లో చోటు చేసుకుంది.

S

Hyderabad | Published On Oct 26, 2026, 3.39 pm IST

Heater | మ‌హిళ‌ ప్రాణాన్ని బ‌లిగొన్న‌ హీట‌ర్..
Advertisement

Heater | త్రినేత్ర న్యూస్ : హీట‌ర్( Heater ) ఓ మ‌హిళ‌ ప్రాణాన్ని బ‌లిగొన్న‌ది. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ బోర‌బండ‌( Borabanda )లో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా గాంధారికి చెందిన అబ్దుల్ ర‌వూఫ్ త‌న భార్య‌ అయేషా సిద్ధిఖి(26), ఏడాది వ‌య‌సున్న కుమారుడితో క‌లిసి భ‌ర‌త్ న‌గ‌ర్‌లో ఉస్మాన్ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అయితే సోమ‌వారం ఉద‌యం హీటర్‌లో ఆమె నీళ్లు పెట్టింది. స్టీల్ మగ్‌తో బకెట్‌లో నీళ్లు తీస్తుండగా కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే అయేషా విల‌విల‌లాడుతూ చ‌నిపోయింది. ఆ సమయంలో అయేషా భర్త అబ్దుల్ రవూఫ్ బయట ఉన్నారు. భార్య మృతితో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు భ‌ర్త‌.

సమాచారం అందుకున్న బోరబండ ఇన్‌స్పెక్టర్ బి.రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement