త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madapur | మాదాపూర్‌లో వ్య‌భిచారం.. ఉజ్బెకిస్థాన్ మ‌హిళ‌లు అరెస్ట్

Madapur | హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ్య‌భిచార దందాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్క‌డో ఒక‌చోట వ్య‌భిచార ముఠా ప‌ట్టుబ‌డుతూనే ఉంది. తాజాగా మాదాపూర్( Madapur ) పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని చంద్ర‌నాయ‌క్ తండాలో ఓ వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్ట‌యింది.

S

Hyderabad | Published On Oct 26, 2026, 3.24 pm IST

Madapur | మాదాపూర్‌లో వ్య‌భిచారం.. ఉజ్బెకిస్థాన్ మ‌హిళ‌లు అరెస్ట్
Advertisement

Madapur | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ్య‌భిచార దందాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్క‌డో ఒక‌చోట వ్య‌భిచార ముఠా ప‌ట్టుబ‌డుతూనే ఉంది. తాజాగా మాదాపూర్( Madapur ) పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని చంద్ర‌నాయ‌క్ తండాలో ఓ వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్ట‌యింది. ఓ స‌ర్వీసు అపార్ట్‌మెంట్‌లోని రూమ్ నంబ‌ర్ 204లో ఈ దందా కొన‌సాగుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మ‌హిళ‌ల‌ను కూక‌ట్‌ప‌ల్లి, మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురు మ‌హిళ‌లు లేకుండా పాస్ పోర్టు, వీసా లేకుండానే నేపాల్ మీదుగా ఇండియాలోకి ప్ర‌వేశించిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది.

ఈ దందా వెనుకాల ఢిల్లీకి చెందిన నాయ‌క్ అనే వ్య‌క్తి ఉన్న‌ట్లు పోలీసులు క‌నుగొన్నారు. ఉజ్బెకిస్థాన్ నుంచి మ‌హిళ‌ల‌ను అక్ర‌మంగా తీసుకువ‌చ్చి.. వ్య‌భిచారం చేయిస్తున్న‌ట్లు తేలింది. ప్ర‌ధాన నిందితుడు నాయ‌క్‌పై కేసు న‌మోదు చేశారు. అత‌ను ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురు మహిళలను కోర్టు ద్వారా స్వదేశానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు. సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు కస్టమర్ల ఐడీ వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసులు హెచ్చరించారు.

Advertisement
Advertisement