త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fake Number Plates | నకిలీ నంబర్‌ ప్లేట్లపై ఉక్కుపాదం.. ఆరు క్రిమినల్‌ కేసులు.. వాహనాలు సీజ్‌

Fake Number Plates | నకిలీ, ట్యాంపరింగ్‌ చేసిన నంబర్‌ ప్లేట్లతో వాహనాలు నడుపుతున్న వారిపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. నంబర్‌ ప్లేట్లను మార్చి వాహనాల గుర్తింపును దాచడం, చలాన్ల నుంచి తప్పించుకోవడం, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడంపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

P

Hyderabad | Published On Jul 31, 2026, 4.19 pm IST

Fake Number Plates | నకిలీ నంబర్‌ ప్లేట్లపై ఉక్కుపాదం.. ఆరు క్రిమినల్‌ కేసులు.. వాహనాలు సీజ్‌
Advertisement

Fake Number Plates | నకిలీ, ట్యాంపరింగ్‌ చేసిన నంబర్‌ ప్లేట్లతో వాహనాలు నడుపుతున్న వారిపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. నంబర్‌ ప్లేట్లను మార్చి వాహనాల గుర్తింపును దాచడం, చలాన్ల నుంచి తప్పించుకోవడం, ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడంపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గత వారం నిర్వహించిన తనిఖీల్లో నకిలీ నంబర్‌ ప్లేట్లతో పట్టుబడిన వారిపై ఆరు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్‌ చేశారు. సుల్తాన్‌బజార్‌, మెహదీపట్నం, బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. అలాగే పెద్దపల్లి, మేడిపల్లి, కట్టంగూర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది.

నకిలీ నంబర్‌ ప్లేట్లతో యాక్టివా, హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌, ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌, పల్సర్‌ తదితర వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)నే వాహనాలకు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. నంబర్‌ ప్లేట్లను మార్చడం, అంకెలు స్పష్టంగా కనిపించకుండా చేయడం, స్టిక్కర్లు లేదా ఇతర మార్గాల్లో నంబర్లను ట్యాంపరింగ్‌ చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. నకిలీ నంబర్‌ ప్లేట్ల విషయంలో ‘జీరో టాలరెన్స్‌’ విధానాన్ని అమలు చేస్తున్నామని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌) డీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement