త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

బీఎస్-4 వాహనదారులకు ఊరట

ఆగస్టు 12, 2025 న 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని, అవి రోడ్ల మీదికి రాకూడదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, అందులో బీఎస్ 4 వాహనాలు కూడా ఉండటంతో వాటిని మినహాయించి బీఎస్ 3 కి చెందిన 15 ఏళ్లు దాటిన పెట్రోల్, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను వాడటానికి వీలు లేదని తాజాగా ఉత్తర్వలు జారీ అయ్యాయి.

J

National | Published On Dec 17, 2025, 6.43 pm IST

బీఎస్-4 వాహనదారులకు ఊరట
Advertisement

ఢిల్లీలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరుగుతోంది. దీంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా గాలిలో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాలు ఇంకా రోడ్ల మీద తిరగడం కూడా ఈ వాయు కాలుష్యానికి కారణం అవుతుండటంతో కాలం చెల్లిన వాహనాలు ఇక రోడ్ల మీద తిరగకూడదని, వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. బీఎస్ 4, దాని కంటే తక్కువ ఎమిషన్ స్టాండర్స్ ఉన్న వాహనాలన్నింటినీ స్క్రాప్‌గా మార్చేయాలని కోర్టు చెప్పింది. కానీ, తాజాగా జారీ చేసిన ఉత్తర్వులలో బీఎస్ 4 వాహనాలకు మినహాయింపు ఇచ్చింది.

2010 సంవత్సరంలో వచ్చిన బీఎస్-4

బీఎస్-4 స్టాండర్డ్ వాహనాలు రావడం స్టార్ట్ అయిందే 2010 సంవత్సరంలో. అంతకుముందు వరకు బీఎస్ 3 మోడల్ వాహనాలు ఉండేవి. బీఎస్ 3 వరకు స్టాండర్డ్స్ ఉన్న వాహనాలు పొగను ఎక్కువగా వదులుతాయి. దాని వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. కానీ, బీఎస్ 4 స్టాండర్డ్ వాహనాల్లో అంతగా పొగ రాదు. కాబట్టి ఈ వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం తరుపున వాదిస్తున్న అదనపు సాలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ సుప్రీంను వేడుకోగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడిన ధర్మాసనం బీఎస్-4 కి మినహాయింపు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఆగస్టు 12, 2025 న 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని, అవి రోడ్ల మీదికి రాకూడదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, అందులో బీఎస్ 4 వాహనాలు కూడా ఉండటంతో వాటిని మినహాయించి బీఎస్ 3 కి చెందిన 15 ఏళ్లు దాటిన పెట్రోల్, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను వాడటానికి వీలు లేదని తాజాగా ఉత్తర్వలు జారీ అయ్యాయి. డిసెంబర్ 18 నుంచి బీఎస్ 3 వరకు ఉన్న మోడల్ వాహనాలేవీ ఢిల్లీలో తిరగకూడదు. వాటిని స్క్రాప్‌ కింద మార్చేయాలి. రోడ్ల మీద తిరిగితే ఆ వాహనదారులకు భారీ జరిమానాను ట్రాఫిక్ పోలీసులు విధించనున్నారు. అలాగే ఆ వాహనాలను సీజ్ చేస్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement