త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jag Laadki | 80886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్‌కి చేరుకున్న జగ్ లాడ్కీ నౌక

గత మూడు రోజుల్లో పశ్చిమాసియా నుంచి సురక్షితంగా భారత్ చేరుకున్న మూడో నౌక ఇది. ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్‌తో శివాలిక్, నందా దేవి నౌకలు భారత్‌కి సురక్షితంగా చేరుకున్న విషయం తెలిసిందే.

J

National | Published On Mar 18, 2026, 5.42 pm IST

Jag Laadki | 80886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్‌కి చేరుకున్న జగ్ లాడ్కీ నౌక
Advertisement

Jag Laadki | ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రోజురోజుకూ యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. ఈనేపథ్యంలో ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. ఈనేపథ్యంలో భారత్‌లో చమురు సమస్యలు రాకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం ఇరాన్‌తో చర్చలు జరుపుతోంది. దీంతో హార్ముజ్ జలసంధి నుంచి భారత్‌కి వచ్చే నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఒమన్ రూట్ నుంచి జగ్ లాడ్కీ అనే భారత్‌కి చెందిన ముడి చమురు నౌక సురక్షితంగా తీరానికి చేరుకుంది. 80886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు ఈ నౌక చేరుకుంది.

ఫుజైరా పోర్ట్ నుంచి రాక

యూఏఈలోని ఫుజైరా పోర్ట్ నుంచి 80886 మెట్రిక్ టన్నుల ముర్బన్ ముడి చమురును తీసుకొని ఈ నౌక మార్చి 15న భారత్‌కి బయలుదేరింది. ఫుజైరా టెర్మినల్‌పై దాడులు జరిగిన నేపథ్యంలో భారత నౌకాదళ యుద్ధనౌక రక్షణలో ఈ ట్యాంకర్ సురక్షితంగా ఒమన్ గల్ఫ్ దాటి భారత్ చేరుకుంది. ఈ నౌకలో 22 మంది భారతీయ నావికులు ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ చమురును పంజాబ్‌లోని బటిండాలో ఉన్న హెచ్‌పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ రిఫైనరీకి తరలించనున్నారు.

సురక్షితంగా భారత్‌కి చేరుకున్న మూడో నౌక

గత మూడు రోజుల్లో పశ్చిమాసియా నుంచి సురక్షితంగా భారత్ చేరుకున్న మూడో నౌక ఇది. ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్‌తో శివాలిక్, నందా దేవి నౌకలు భారత్‌కి సురక్షితంగా చేరుకున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement