CUET UG | మే 28న జరగాల్సిన సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
CUET UG | సెంట్రల్ యూనివర్సిటీల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET UG)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తున్నది. ఈ నెల 11న ప్రారంభమైన పరీక్షలు మే 31న ముగియనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు NTA కీలక అప్‌డేట్ ఇచ్చింది.
CUET UG | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET UG)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తున్నది. ఈ నెల 11న ప్రారంభమైన పరీక్షలు మే 31న ముగియనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు NTA కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 28న జరగాల్సిన పరీక్షలను వాయిదా (postponed) వేసింది. ఈద్-ఉల్-జుహా (Bakrid) సేలవు తేదీలో మార్పు రావడంతో ఆ రోజున రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించాల్సిన పరీక్షను మరో తేదిన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బక్రీద్ సెలవు తేదీలో మార్పునకు సంబంధించి కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మళ్లీ పరీక్షను ఎప్పుడునిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అభ్యర్థులు ఎన్‌టీఏ, సీయూఈటీ వెబ్‌సైట్స్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఈ పరీక్షలు దేశంలోని వివిధ నగరాలతోపాటు విదేశాల్లోని వివిధ కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతి షిఫ్ట్ గరిష్ఠంగా 3 గంటల పాటు ఉంటుంది. అభ్యర్థికి కేటాయించిన సబ్జెక్టుల సంఖ్యను బట్టి కనీసం 1 గంట, గరిష్ఠంగా 3 గంటల వరకు పరీక్షా కేంద్రంల్లోనే తప్పనిసరిగా ఉండవలి. అంటే ఒక సబ్జెక్టు ఉన్నవారు 1 గంటలో, రెండు సబ్జెక్టులు ఉన్నవారు 2 గంటల తర్వాత పరీక్ష ముగించి బయటకు రావచ్చు. ఈ ఏడాది 15 లక్షల మందికిపైగా విద్యార్థులు సీయూఈటీ-యూజీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
📢 Important update for CUET (UG) 2026 candidates.
The examinations scheduled for 28 May 2026 (both shifts) stand postponed — in view of the change in the date of the Id-ul-Zuha (Bakrid) holiday as per Government of India notification.
🗓️ Revised exam dates for affected… pic.twitter.com/I9KhTFwMhE
— National Testing Agency (@NTA_Exams) May 24, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

LPU | ఎల్పీయూలో 10 రోజుల పాటు క్లాసులు బంద్.. మిడ్ టర్మ్ పరీక్షలు వాయిదా
సెప్టెంబర్ 28, 2026

Bank Employees Strike | వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా
సెప్టెంబర్ 28, 2026

NTA Examination Calendar | జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్-1.. వివిధ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎన్‌టీఏ
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు
- ●Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..
- ●Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..
- ●PB Fintech | పాలసీ బజార్ షేర్లకు ఊరట.. 4 శాతం జంప్.. కొనాలా.. వేచి చూడాలా..?
- ●Additional Collector | కంటైనర్‌ను ఢీకొట్టిన కారు.. కొత్తగూడెం అదనపు కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు

Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..

Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..



