NRI Death | కర్మ అంటే ఇదేనా? సోఫాకి కాళ్లు తగిలి జేబులో ఉన్న గన్ పేలి ఎన్ఆర్ఐ మృతి
ఇటీవలే విదేశాల నుంచి వచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిన హర్పిందర్‌కి రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఎక్కడో విదేశాల్లో ఉండి.. ఇటీవలే సొంత దేశానికి వచ్చి కుటుంబ సభ్యుల ముందే చిన్న ఘటనకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
NRI Death | చాలామంది కర్మ గురించి చెబుతుంటారు కానీ కొందరు దాన్ని కొట్టిపారేస్తుంటారు. ఈ ఘటన చూస్తుంటే కర్మ అనేది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తి పుణ్యానికి సోఫాలో కూర్చున్న ఓ వ్యక్తి లేచి నిలబడి సోఫాకు కాళ్లు తాకడంతో బెల్ట్‌కి పెట్టుకొని ఉన్న పిస్తోల్ పేలి కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. తన గన్ తన ప్రాణమే తీస్తుందని ఆ వ్యక్తి కలలో కూడా ఊహించి ఉండడు. ఈ ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది.
హర్పిందర్ సింగ్ అలియాస్ సోనూ అనే ఎన్ఆర్ఐ ఇటీవలే ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ధాని సుచ సింగ్ అనే గ్రామంలో సెటిల్ అయ్యాడు. విదేశాలకు వెళ్లకుండా గ్రామంలోనే ఉంటున్నాడు. అయితే.. తన ఇంట్లో సోఫాలో కూర్చొని కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడుతూ ఒక్కసారిగా నిలబడ్డాడు. దీంతో పక్కనే ఉన్న సోఫాకి తన కాళ్లు తగిలాయి. దీంతో తన బెల్ట్‌కి ఏర్పాటు చేసిన కవర్‌లో ఉన్న పిస్తోల్ ట్రిగ్గర్ అయింది. అందులో బుల్లెట్స్ కూడా లోడ్ అయి ఉండటంతో ఒక బుల్లెట్ నేరుగా హర్పిందర్ కడుపులోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్త స్రావం అయింది. గన్ సౌండ్ వినగానే వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ.. డాక్టర్లు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో అక్కడికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సోఫాలో కూర్చొని లేవడం, సోఫా తగలడం, గన్ పేలడం, వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లడం.. అన్నీ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
ఇటీవలే విదేశాల నుంచి వచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిన హర్పిందర్‌కి రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఎక్కడో విదేశాల్లో ఉండి.. ఇటీవలే సొంత దేశానికి వచ్చి కుటుంబ సభ్యుల ముందే చిన్న ఘటనకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






