Nitish Kumar | నేడు ఎమ్మెల్సీ పదవికి నితీశ్ రాజీనామా.. సీఎం సీటు ఖాళీ చేస్తారా?
Nitish Kumar | ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఎట్టకేలకు తన ఎమ్మెల్సీ పదవిని (Legislative Council) వదులుకోనున్నారు. సోమవారం ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించనున్నారు.
Nitish Kumar | త్రినేత్ర.న్యూస్: ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఎట్టకేలకు తన ఎమ్మెల్సీ పదవిని (Legislative Council) వదులుకోనున్నారు. సోమవారం ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించనున్నారు. ఈ మేరకు జేడీయూ పార్టీ (JDU) వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 69 ప్రకారం రాజ్యసభ (Rajya Sabha) ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 14 రోజుల లోపు ఎన్నికైన వ్యక్తి తన పాత పదవికి ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆలోపు రాజీనామా చేయకపోతే ఆ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ స్థానం ఆటోమేటిక్‌గా ఖాళీ అయినట్లుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో మార్చి 16న పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికైన నీతీశ్.. ఈ నెల 30 నాటికి ఆ రెండు పదవుల్లో ఏదో ఒకదాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవిని వదులుకోనున్నారని జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ తెలిపారు.
అయితే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. నీతీశ్ ప్రస్తుతం బీహార్ శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. ఆయన 2024 మే 7న ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేశారు. నీతీశ్ ఎమ్మెల్సీ పదవీకాలం 2030 మే6న ముగియనుంది. ఈలోపే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకున్నది. అయితే నితీశ్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశాల్లోకి వెళ్లడాన్ని పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆయన ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం.. ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్న ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్
మే 19, 2026

Bihar Cabinet Expansion | బీహార్లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ తనయుడు
మే 7, 2026

CM Revanth Reddy | నితీష్ గతే చంద్రబాబుకు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



