త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nirmala Sitharaman | వరుసగా 9వసారి​.. చరిత్ర సృష్టించనున్న నిర్మలమ్మ‌..

Nirmala Sitharaman | గ‌త ఆరేండ్లుగా నిరంత‌రాయంగా దేశ ఆర్థిక మంత్రిగా కొన‌సాగుతూ స‌రికొత్త రికార్డు సృష్టించిన నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Sitharaman) మ‌రో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించినున్నారు. వ‌రుస‌గా తొమ్మిదోసారి కేంద్ర బ‌డ్జెట్‌ను (Union Budget ) ప్ర‌వేశ‌పెడుతూ భార‌త పార్ల‌మెంట‌రీ చ‌రిత్ర‌లో, స్వ‌తంత్ర భార‌త దేశంలో ఆ ఘ‌న‌త సాధించిన‌ తొలి వ్య‌క్తిగా, మ‌హిళ‌గా నిలువ‌నున్నారు.

G

National | Published On Feb 1, 2026, 6.53 am IST

Nirmala Sitharaman | వరుసగా 9వసారి​.. చరిత్ర సృష్టించనున్న నిర్మలమ్మ‌..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: గ‌త ఆరేండ్లుగా నిరంత‌రాయంగా దేశ ఆర్థిక మంత్రిగా కొన‌సాగుతూ స‌రికొత్త రికార్డు సృష్టించిన నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Sitharaman) మ‌రో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించినున్నారు. వ‌రుస‌గా తొమ్మిదోసారి కేంద్ర బ‌డ్జెట్‌ను (Union Budget ) ప్ర‌వేశ‌పెడుతూ భార‌త పార్ల‌మెంట‌రీ చ‌రిత్ర‌లో, స్వ‌తంత్ర భార‌త దేశంలో ఆ ఘ‌న‌త సాధించిన‌ తొలి వ్య‌క్తిగా, మ‌హిళ‌గా నిలువ‌నున్నారు.

2019లో దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మ‌ల‌మ్మ.. ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది బ‌డ్జెట్ల‌ను (ఒక మధ్యంతర బడ్జెట్‌తో కలిపి) సమర్పించారు. మ‌రికొన్ని గంట‌ల్లో మ‌రోసారి బ‌డ్జెట్ ప్ర‌సంగం (Budget Speech) చేయ‌నున్నారు. దీంతో వ‌రుస‌గా 9వ సారి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన తొలి మంత్రిగా నిలువ‌నున్నారు. అంత‌కుముందు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆయన వరుసగా ప్రవేశపెట్టలేదు. వేర్వేరు సమయాల్లో అందించారు.

మాజీ ఆర్థిక మంత్రి పీ.చిదంబరం కూడా మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఆయన కూడా వరుసగా కాదు. దీంతో అత్య‌ధిక బ‌డ్జెట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక మంత్రిగా చిదంబరం రికార్డును నిర్మ‌ల‌మ్మ ఆదివారం నాటి త‌న ప్ర‌సంగంతో సమం చేయనున్నారు. నిర్మ‌లా సీతారామ‌న్‌కు ముందు వరుసగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన వారిలో మొరార్జీ దేశాయ్ (6 సార్లు), మన్మోహన్ సింగ్ (5 ప‌ర్యాయాలు), యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీ వంటివారు ఉన్నారు.

నిరంత‌రాయంగా..

ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్ర‌భుత్వంలో తొలుత‌ అరున్ జైట్లీ ఆర్థిక మంత్రిగా సేవ‌లు అందించారు. అయితే ఆయ‌న మృతి త‌ర్వాత‌.. 2019 మే 31న ఆర్థిక మంత్రిగా నిర్మ‌లా సీతారామ‌న్‌ బాధ్యతలు చేప‌ట్టారు. 2026 జనవరి 31 నాటికి ఆమె ఈ పదవిలో 6 ఏండ్ల‌ 8 నెలలు పూర్తి చేసుకున్నారు. దీంతో నిరంత‌రాయంగా అత్య‌ధికాలం ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన వ్య‌క్తిగా నిలిచారు. అంత‌కుముందు సీడీ. దేశ్‌ముఖ్ సుమారు 6 ఏండ్ల‌ 2 నెలల పాటు దేశ విత్త మంత్రిగా పనిచేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న రికార్డును నిర్మల అధిగ‌మించ‌నున్నారు. గ‌తంలో మన్మోహన్ సింగ్ 5 సంవ‌త్స‌రాలు, అరుణ్ జైట్లీ 4 ఏండ్ల‌ 8 నెలలు, యశ్వంత్ సిన్హా 4 ఏండ్ల‌ 4 నెలలు ఈ పదవిలో కొన‌సాగారు.

సుధీర్ఘ ప్ర‌సాగాల్లోనూ..

ఇక బ‌డ్జెట్ ప్ర‌సంగాల్లోనూ నిర్మ‌ల‌మ్మ రికార్డు సృష్టించారు. 2020 ఫిబ్రవరి 1న ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇదే ఎక్కువ సేపు బడ్జెట్ ప్రసంగంగా ఉంది. ఆ సమయంలో ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే తన ప్రసంగాన్ని ముగించారామె (Longest Budget Speech). ఆ రికార్డు ఇప్పటికీ అలాగే చెక్కుచెద‌ర‌కుండా ఉంది.

పదాల సంఖ్య‌ పరంగా..

అతి పొడవైన బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుపై ఉన్న‌ది. 1991లో త‌న ప్ర‌సంగంలో 18,604 పదాలను ఉపయోగించారు (Highest Words Budget Speech). 2018లో అప్ప‌టి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం ఈ రికార్డును స‌మీపించింది. ఇక.. అతిచిన్న బ‌డ్జెట్ ప్ర‌సంగం చేసిన మంత్రిగా హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ నిలిచారు. 1977లో ఆయ‌న‌ కేవలం 800 పదాలతో బడ్జెట్ ప్రసంగం ముగించారు. ఇప్పటివరకు తక్కువ పదాలతో వచ్చిన బడ్జెట్ కూడా ఇదేకావ‌డం గ‌మ‌నార్హం.

కాగా, బ‌డ్జెట్ ప్ర‌తిని బ్రీఫ్‌కేస్‌లో తీసుకొచ్చే సంప్ర‌దాయానికి 2019లో నిర్మ‌లా సీతారామ‌న్ ఫుల్‌స్టాప్ పెట్టారు. భారతీయత ఉట్టిప‌డేలా ఎర్రటి వస్త్రంతో కూడిన 'బహీ ఖాతా'ను తీసుకొచ్చారు. 2021 నుంచి డిజిట‌ల్ ప‌ద్ద‌తిలో 'ట్యాబ్లెట్' ద్వారా బడ్జెట్‌ను స‌మ‌ర్పిస్తున్నారు. నాలుగేండ్ల నుంచి పేప‌ర్‌లెస్ విధానంలో బ‌డ్జెట్‌ను స‌మ‌ర్పిస్తున్న ఆమె.. ఇప్పుడు కూడా ఆ సంప్ర‌దాయాన్ని కొన‌సాగించ‌నున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement