త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prahlad Joshi | తెలంగాణ‌కు ఏం ఇవ్వ‌లేద‌ని త‌ప్పుడు ప్ర‌చారం : కేంద్ర‌మంత్రి ప్ర‌హ్లాద్ జోషి

P

Telangana | Published On Feb 6, 2026, 6.31 pm IST

Prahlad Joshi | తెలంగాణ‌కు ఏం ఇవ్వ‌లేద‌ని త‌ప్పుడు ప్ర‌చారం : కేంద్ర‌మంత్రి ప్ర‌హ్లాద్ జోషి
Advertisement

Prahlad Joshi | తెలంగాణ‌కు ఏం ఇవ్వ‌లేద‌ని ప‌లు పార్టీల నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని కేంద్ర‌మంత్రి ప్ర‌హ్లాద్ జోషి ఆరోపించారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా రాష్ట్రంలో 42 రైల్వేస్టేష‌న్ల‌ను ఆధునికీక‌రించామ‌న్నారు. కేంద్రం దేశ‌వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఏడు హైస్పీడ్ కారిడార్ల‌ను ఏర్పాటు చేస్తుంద‌ని, ఇందులో హైద‌రాబాద్‌కే ఇచ్చింద‌ని గుర్తు చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌పై మోదీకి ప్రేమ ఉంద‌ని ఉంద‌న్నారు. వీబీ జీ రామ్ జీ పథకంతో.. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేశారని తప్పుడు ప్రచారం చేశార‌ని, ఈ ప‌థ‌కానికి గ‌తంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించామ‌న్నారు. భార‌త్ ప్ర‌పంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శ‌క్తిగా ఎదుగుతోంద‌న్నారు.

మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ అన్ని వ‌ర్గాల అభివృద్ధికి దోహ‌దం చేస్తుంద‌న్నారు. బ‌డ్జెట్ 2047 విక‌సిత్ భార‌త్ నిర్మాణం ల‌క్ష్యంగా ఉంద‌ని.. ఇది ఆర్థిక శ‌క్తిని బ‌లోపేతం చేస్తుంద‌ని జోషి పేర్కొన్నారు. మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భార‌త్‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏఐ జ‌న‌రేష‌న్ న‌డుస్తోంద‌న్న ఆయ‌న‌.. ఈ నేప‌థ్యంలో కొత్త సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్న‌ట్లు చెప్పారు. కాంగ్రెస్ సుదీర్ఘ‌కాలం దేశాన్ని పాలించింద‌ని.. ఎన్న‌డూ సంస్క‌ర‌ణ‌లు తీసుకురాలేద‌ని విమ‌ర్శించారు. బడ్జెట్‌లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కే పెద్ద‌పీట వేశామ‌న్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో 5వేల కిలోమీట‌ర్ల జాతీయ ర‌హ‌దారులు కేటాయించామ‌ని, ప‌ట్ట‌ణాలు, గ్రామీణ ప్రాంతాల‌కు నిధుల‌తో పాటు గ్రాంట్స్‌ను విడుద‌ల చేసిన‌ట్లు గుర్తు చేశారు.

Advertisement
Advertisement