NIACL | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్‌లు.. ఏడాది శిక్షణతో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో అవకాశాలు..
NIACL | ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ (general insurance) సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అప్రెంటీస్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ (Apprentice) ట్రైనింగ్ స్కీమ్ (NATS)లో భాగంగా 550 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నది.
NIACL | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వరంగ జనరల్ ఇన్సూరెన్స్ (general insurance) సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అప్రెంటీస్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. నేషనల్ అప్రెంటిస్‌షిప్ (Apprentice) ట్రైనింగ్ స్కీమ్ (NATS)లో భాగంగా 550 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 6 వరకు www.newindia.co.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది కాలం పాటు శిక్షణ ఇస్తారు. ప్రతినెల రూ.12,300 స్టెయిఫండ్ అందిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్‌లో 17 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 550
ఇందులో తెలంగాణలో 18 (ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ 9), ఏపీలో 17 (ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 1, జనరల్ 9) చొప్పున ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తి ఉండాలి. 2022, జనవరి 1కి ముందు, 2026, జూన్ 1 తర్వాత డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు కాదు. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 చొప్పున 100 ప్రశ్నలు అడుగుతారు. గంట వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫలితాలు, ఇంటర్య్వూ సమాచారం beep.bfsissc.com వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
అభ్యర్థులు ముందుగా ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో (https://nats.education.gov.in) రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత https://beep.bfsissc.com/candidate_login పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 6
అప్లికేషన్ ఫీజు: రూ.800 (పురుషులు), రూ.600 (మహిళలు), ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200. జీఎస్టీ (18 శాతం) అదనం.
రాతపరీక్ష: జూలై 12
వెబ్‌సైట్: www.newindia.co.in
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ramchandar Rao | వందేమాతర గేయాన్ని అవమానించారు.. కాంగ్రెస్‌వాళ్లకు సిగ్గు మిగిలి ఉంటే క్షమాపణ చెప్పాలి
- ●Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్
- ●Air India | మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు డ్రగ్స్ పాజిటివ్
- ●MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ
- ●Ravi Teja | ఇవేం బూతులు బాబోయ్ - ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెటిజన్ల ట్రోల్స్
- ●Dasoju Sravan Kumar | నిన్ను కూల్చనీకి కేసీఆర్ అక్కర్లేదు.. నీకు నీవే కూల్చుకునే అసలైన భస్మాసురుడివి నువ్

Ramchandar Rao | వందేమాతర గేయాన్ని అవమానించారు.. కాంగ్రెస్‌వాళ్లకు సిగ్గు మిగిలి ఉంటే క్షమాపణ చెప్పాలి

Malavika Sharma | బీఫ్ ఇష్టమా? - మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్రశ్న - నెటిజన్లు ఫైర్

Air India | మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు డ్రగ్స్ పాజిటివ్

MLC Ramana | అర్హులైన చేనేత కార్మికులకు చేయూత పెన్షన్ ఇవ్వండి..: ఎల్ రమణ






