త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malavika Sharma | బీఫ్ ఇష్ట‌మా? – మ‌ల‌యాళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్ర‌శ్న‌ – నెటిజ‌న్లు ఫైర్‌

టాలీవుడ్ హీరోయిన్ మాళ‌వికా శ‌ర్మ‌కు మ‌ల‌యాళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టిస్తున్న ఖ‌లీఫా సినిమాలో మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బీఫ్ గురించి మ‌ల‌యాళ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు మాళ‌వికా శ‌ర్మ ఇబ్బంది ప‌డింది.

N

Entertainment | Published On Aug 17, 2026, 1.36 pm IST

Malavika Sharma | బీఫ్ ఇష్ట‌మా? – మ‌ల‌యాళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో టాలీవుడ్ హీరోయిన్‌కు ప్ర‌శ్న‌ – నెటిజ‌న్లు ఫైర్‌
Advertisement

Malavika Sharma | టాలీవుడ్ హీరోయిన్ మాళ‌వికా శ‌ర్మ‌కు ఓ మ‌ల‌యాళ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో విచిత్ర‌మైన అనుభ‌వం ఎదురైంది. తెలుగు సినిమాల‌తో కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో ఖ‌లీఫా సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌ల‌యాళ అగ్ర న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ ఆగ‌స్ట్ 20న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. ఖ‌లీఫా మూవీలో మాలీవుడ్ స్టార్ మోహ‌న్‌లాల్ గెస్ట్‌గా న‌టించాడు.

బీఫ్ ఇష్ట‌మా?

ఖ‌లీఫా ప్ర‌మోష‌న్స్‌తో గ‌త కొద్ది రోజులుగా మాళ‌వికా శ‌ర్మ బిజీగా ఉంది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మాళ‌వికా శ‌ర్మ‌కు మ‌ల‌యాళ‌ మీడియా ప్ర‌తినిధి నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. "కేర‌ళ‌లో ప‌రోటా, బీఫ్ ఫ్రై ఫేమ‌స్‌...వాటిని మీరు రుచి చూశారా? మీకు బీఫ్ అంటే ఇష్ట‌మా? ఎప్పుడైనా తిన్నారా?" అంటూ ప్ర‌శ్న అడిగాడు. అత‌డి ప్ర‌శ్న‌కు తాను వెజిటేరియ‌న్‌ను అని మాళ‌వికా సున్నితంగా జ‌వాబు చెప్పింది. రుచి బాగుంటుందంటూ స‌ద‌రు మీడియా ప్ర‌తిధిని ప్ర‌శ్న‌ను పొడిగించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో "నాన్‌వెజ్ అస్స‌లు తిన‌న‌ని .... సినిమా గురించి మాట్లాడుదాం" అంటూ మాళ‌వికా అత‌డిని మాట‌ల‌ను మ‌ధ్య‌లోనే ఆపేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కావాల‌నే అడిగారా?

మాళ‌వికా శ‌ర్మ బ్రాహ్మిణ్ అని, కావాల‌నే మ‌ల‌యాళ మీడియా బీఫ్ గురించి ఆమెను అడిగి ఇబ్బంది పెట్టార‌ని నెటిజ‌న్లు అంటున్నారు. తాను వెజిటేరియ‌న్ అని చెప్పినా కూడా ప్ర‌శ్న‌ను కొన‌సాగించ‌డం స‌రికాద‌ని పోస్ట్‌లు పెడుతున్నారు. మ‌ల‌యాళంలో సినిమాలు చేసే ఇత‌ర భాష న‌టీమ‌ణుల‌ను బీఫ్ గురించి మ‌ల‌యాళం మీడియా అడ‌గ‌టం కామ‌న్‌గా మారింద‌ని, ఈ తీరు మారాల‌ని అంటున్నారు.

ర‌వితేజ నేల‌టికెట్‌....

ర‌వితేజ నేల‌టికెట్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మాళ‌వికా శ‌ర్మ‌. రామ్ పోతినేని రెడ్‌తో పాటు గోపీచంద్ భీమా, సుధీర్ బాబుతో హ‌రోంహ‌ర సినిమాలు చేసింది. ఈ సినిమాల్లో గ్లామ‌ర్ రోల్స్‌లో క‌నిపించింది. ఈ సినిమాలేవి ఆమెకు విజ‌యాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.

 

Advertisement
Advertisement