త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ద‌ళారుల‌కే ధాన్యం అమ్ముకోండి.. రైతుల‌కు మంత్రి పొన్నం సూచ‌న‌

Ponnam Prabhakar | వ‌రి ధాన్యం( Paddy ) విక్ర‌యం విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన మ‌ద్ద‌తు ధ‌ర కంటే ద‌ళారులు ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేస్తే వారికే అమ్ముకోవ‌చ్చ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్( Ponnam Prabhakar ) రైతుల‌కు సూచించారు.

S

Telangana | Published On Oct 26, 2026, 5.12 pm IST

Ponnam Prabhakar | ద‌ళారుల‌కే ధాన్యం అమ్ముకోండి.. రైతుల‌కు మంత్రి పొన్నం సూచ‌న‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : వ‌రి ధాన్యం( Paddy ) విక్ర‌యం విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన మ‌ద్ద‌తు ధ‌ర కంటే ద‌ళారులు ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేస్తే వారికే అమ్ముకోవ‌చ్చ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్( Ponnam Prabhakar ) రైతుల‌కు సూచించారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ యార్డులో వ‌రి ధాన్యం, ప‌త్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రైతుల‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.

హుస్నాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా సోమ‌వారం నుంచే 136 వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. సాగునీటి కొర‌త వ‌ల్ల ఈ సీజ‌న్‌లో వరి సాగు తగ్గడంతో ధాన్యానికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. రైతుల కళ్లాల వద్దకే దళారులు వస్తున్నారని, ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే దళారులు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే నిర్మోహమాటంగా అమ్ముకోవచ్చని రైతులకు సూచించారు. ఇక రాష్ట్రంలో 300కు పైగా క‌రువు మండ‌లాలు ఉన్నాయ‌న్నారు. కేంద్రం నుంచి రావాల్సిన స‌హాయం కోసం అక్టోబ‌ర్ 28న అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు.

2007లోనే శ్రీకారం చుట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు భూములు త్యాగం చేయడం వల్లే నేడు వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోందని, భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరి త్యాగాన్ని ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement