Mallavazhula Sadashivudu Memorial Awards | చమన్ సింగ్, సంగిశెట్టిలకు ‘మల్లావఝల’ అవార్డ్స్
Mallavajhala Awards | ప్రముఖ కవి, కథా రచయిత చమన్ సింగ్‌ను, సాహిత్య విమర్శకులు, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ లను ప్రముఖ కవి, గీత రచయిత, గోదావరి గొంతుక మల్లావఝల సదాశివుడు స్మారక పురస్మారానికి (Mallavazhula Sadashivudu Memorial Awards) ఎంపిక చేసినట్లు సమితి గౌరవ అధ్యక్షుడు కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) ప్రకటించారు.
- వచ్చేనెల 3న కేటీఆర్ చేతుల మీదుగా ప్రదానం
- కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
Mallavazhula Sadashivudu Memorial Awards | త్రినేత్ర న్యూస్: ప్రముఖ కవి, కథా రచయిత చమన్ సింగ్‌ను, సాహిత్య విమర్శకులు, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ లను ప్రముఖ కవి, గీత రచయిత, గోదావరి గొంతుక మల్లావఝల సదాశివుడు స్మారక పురస్మారానికి (Mallavazhula Sadashivudu Memorial Awards) ఎంపిక చేసినట్లు సమితి గౌరవ అధ్యక్షుడు కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas) ప్రకటించారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో వచ్చేనెల 3న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో మల్లావఝల సదాశివుడు రాసిన ‘తలాపునా పారుతుంది గోదారీ... నా చేనూ నా చెలకా ఎడారి’ పాట తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపిందని గుర్తు చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి వివరాలను వెల్లడించారు.
ఏమున్నదక్కో.. ఈ ఊళ్లె నాకింక ఏమున్నదక్కా
ఈ సందర్భంగా దేశపతి మాట్లాడారు. 2024-25 సంవత్సరానికి చమన్ సింగ్, 2025-26 సంవత్సరానికి గాను సంగిశెట్టి శ్రీనివాస్‌లకు అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కుల వివక్షపై మల్లావఝల రాసిన ‘ఎన్నాళ్లు ఈ వెలివేత, ఎన్నాళ్లు ఈ వలపోత’ అనే గేయం సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాఢ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిందన్నారు. తెలంగాణ ప్రజల్లో పోలీసుల హింసతో వలసపోతున్న యువతరం ‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కా.. ముల్లె సదురుకున్న, ఎల్లిపోతా ఉన్న, ఈ ఊళ్లె నాకింక ఏమున్నదక్కా..’ అనే పాటతో పాటు, వరకట్న వేధింపులపై ‘పారాణి ఆరలేదు చెల్లెలా.. నీకు నూరేళ్లు నిండినాయా చెల్లెలా..’ పాటలు ఆనాటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న వరకట్న కోరల జాఢ్యంపై మల్లావఝల తిరుగుబాటు గేయాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయన్నారు.
అణగారిన వర్గాలపై రచనలకు..
ఏటా మల్లావఝల పేరిట స్మారక పురస్కారాన్ని అణగారిన కులాల పక్షాన రచనలు చేసి, ప్రజల గొంతుకై నిలిచిన ప్రజా కవులకు ఇస్తున్నట్లు ఎమ్మెల్సీ దేశపతి వివరించారు. ఇప్పటివరకు 90 శాతానికి పైగా దళిత, బహుజన కవులకే ఈ అవార్డు అందజేశారన్నారు. మల్లావఝల స్మారక పురస్కారాన్ని అందుకున్న వారిలో ప్రజా గొంతుకలై నిలిచిన కవులు గూడ అంజన్న, జయరాజు, గోరేటి వెంకన్న, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, విమలక్క, నిస్సార్, మిట్టపల్లి సురేందర్, ఏపూరి సోమన్న, తైదల అంజన్న, వజ్జల శివకుమార్, బెల్లి యాదయ్య, ఆయాచితం శ్రీధర్, మోహన్ ఋషి, మునాస వెంకట్, వనపట్ల సుబ్బయ్య, కోడూరి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారని తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మల్లావఝల విజయానంద్ వెల్లడించారు.
సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించినందుకుగాను ప్రముఖ రచయిత్రి తిరునగరి దేవకీదేవి, గోదావరిఖనికి చెందిన ప్రముఖ గాయకుడు కవ్వంపల్లి స్వామికి అదే రోజున ప్రత్యేక సత్కారాలు అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Flex Fuel Vehicles India | పెట్రోల్ బదులు 100% ఇథనాల్: రోడ్లపైకి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే!
- ●Papikondalu Tour | అర్నాబ్ ఎఫెక్ట్.. పాపికొండల టూర్‌కు బ్రేక్..!
- ●SIP | ఐదేళ్లలో సొంతింటి కల నెరవేర్చుకోవాలా? నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
- ●Ramachander Rao | మాటిమాటికి సీఎం ఢిల్లీ ఎందుకు పోతున్నడు..?
- ●MLC Dasoju Sravan | అప్పుడు 10.36 లక్షల ఓట్లుంటే.. ఇప్పుడు 4.98 శాతమే నమోదైనయ్
- ●Supreme Court | ఫామ్ 6 సమర్పించినందుకు ఓటర్లపై ఎలాంటి ప్రాసిక్యూషన్ ఉండదు.. సుప్రీంకోర్టు భరోసా

Flex Fuel Vehicles India | పెట్రోల్ బదులు 100% ఇథనాల్: రోడ్లపైకి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే!

Papikondalu Tour | అర్నాబ్ ఎఫెక్ట్.. పాపికొండల టూర్‌కు బ్రేక్..!

SIP | ఐదేళ్లలో సొంతింటి కల నెరవేర్చుకోవాలా? నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!

Ramachander Rao | మాటిమాటికి సీఎం ఢిల్లీ ఎందుకు పోతున్నడు..?




