Ponnam Prabhakar | తెలంగాణ మా అయ్య జాగీరే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్..!
Ponnam Prabhakar | తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. అవును తెలంగాణ మా అయ్య జాగీరే.. తెలంగాణ ప్రజల అయ్య జాగీరేనంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
Ponnam Prabhakar | తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. అవును తెలంగాణ మా అయ్య జాగీరే.. తెలంగాణ ప్రజల అయ్య జాగీరేనంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ తెలంగాణకు రావొద్దన్నట్లుగా.. ఇది భారతదేశమా పాకిస్తానా? అనే మాటలు మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆనాడు ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రజల ఆకాంక్షగా ఉండిందని, విడిపోయి కలిసుందాం తెలుగు రాష్ట్రాలుగా అనేది నినాదమని ఆయన గుర్తుచేశారు. గత 12 సంవత్సరాల్లో ఆంధ్రాకు చెందిన వారు ఇక్కడ ఉండొద్దని, వ్యాపారాలు చేయొద్దని ఎప్పుడూ అనలేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీవాళ్లు పెట్టుబడి పెట్టొద్దని ఎవరు అంటారని, తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రాకు రావొద్దని మీరు అంటున్నారు కావొచ్చని వ్యాఖ్యానించారు.
అహంకారంతో మాట్లాడారు..
పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది మా అయ్య జాగీరేనని, మా తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల ప్రజల అయ్యజాగీరేనని, నీ అయ్య జాగీరు కాదని గుర్తుపెట్టుకోమని వ్యాఖ్యానించారు. చనిపోయిన తెలంగాణ కళాకారుడు గద్దర్‌కు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గద్దర్‌కు కారు కొనిచ్చానని చెప్పారని, చనిపోయిన వారి గురించి మాట్లాడడమే అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. ఓ కళాకారుడు, ఓ భావజ్వాల వ్యాప్తికి చెందిన వ్యక్తి అమరుడై అతన్ని తాము తెలంగాణ ఉద్యమానికి, ప్రజాస్వామిక వాదిగా గౌరవించుకునే సందర్భంలో ఆయనకు కారు కొనిచ్చానని చెప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అహంకారమేంటో తెలంగాణలోని దళిత వర్గాలు ఆలోచన చేయాలని అన్నారు. తాము ఏ అహంకారానికి వ్యతిరేకంగా పోరాడామో, ఏ దురహంకారం తమపై ఆధిపత్యం చెలాయించొద్దని అనుకున్నామో, అదే దురహంకారం, అదే ఆధిపత్యంతో మాట్లాడుతున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ భారత్‌లో అంతర్భాగమే..
తాము ఇవాళ కూడా చెబుతున్నామని, భారతదేశంలో ప్రజాస్వామిక తెలంగాణ అంతర్భాగమేనని తెలిపారు. తాము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకు వెళ్తామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాలని పొన్నం తెలిపారు. ఆయన ప్రెస్‌మీట్‌లో ఇది పాకిస్తానా? భారతదేశమా? పాస్‌పోర్ట్ తీసుకోవాలా అని మాట్లాడుతున్నారని, ఈ మైండ్‌సెట్ మార్చుకోవాలని సూచించారు. పవన్ శాసనసభలో ఉన్నారని, పార్లమెంట్ గురించి ఆయనకు తెలిసే ఉండదని వ్యాఖ్యానించారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా పని చేశానని, తెలంగాణ బిల్లు ఓటింగ్ జరిగే సమయంలో తాను ఉన్నానని, ప్రత్యేక సాక్షినని తెలిపారు. అంతకు ముందు సైతం ఏ చిన్న బిల్లు వచ్చినా తలుపులు వేసేవారన్నారు. తలుపులేసి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ చేసుకున్నారని మాట్లాడుతున్నారని, ఇప్పటికీ ఇంత కక్ష్య, అక్కసు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
పవన్ మాట్లాడిన కొద్ది పక్క నుంచి స్లిప్పులు వస్తున్నాయని, పాపం పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ అని వ్యాఖ్యానించారు. రేపు పొద్దున తన వద్ద బాగా డబ్బులు ఉంటే తాను కూడా ఇలా మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని, ఆయనకు వచ్చే చిట్టీలు బీజేపీ, టీఆర్ఎస్ నుంచి వస్తున్నాయా? తెలియదని అన్నారు. మేం ఎవ్వరినీ అవమానించడం లేదని, ఏపీ ప్రజలు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూర్చున్నప్పుడు కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే వాతావరణాన్ని కలుగజేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఉన్న వారు రాజకీయాల్లో పోటీ చేసి గెలిస్తే అభ్యంతరం లేదని చెప్పారు. ఏమన్నా అంటే కొండగట్టుకు పైసలు ఇచ్చిన అంటున్నారని, నీ అయ్య జాగీరా పైసలు అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు రానివ్వరా? మాట్లాడనివ్వరా, తిరగనివ్వరా అని మాట్లాడుతున్నారని.. నాలుగు నెలల కిందట వచ్చినప్పుడు తెలంగాణకు అతిథిగా వచ్చారని, ప్రోటోకాల్ ఇచ్చామని, అది మరిచిపోయి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
అక్కడే ఏం పీకలేదు.. ఇక్కడేం పీకుతవ్
తెలంగాణ ఆవిర్భావం రోజున శుభాకాంక్షలు చెబుతానని రావాలని, ఇది ప్రజల ఆకాంక్ష, ప్రజలు పోరాడి సాధించుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో వచ్చి పీకేది ఏముందని వ్యాఖ్యానించారు. నువ్వే చెప్పినదే కదా? అక్కడే ఏం పీకడం లేదు.. ఇక్కడ ఏం పీకుతానని అన్నారని, మళ్లీ ఎందుకు ఇలా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు సరిగా స్క్రిప్ట్ రాసివ్వడం లేదని, ఒక మాట పొత్తు పెట్టుకోమని, పెట్టుకుంటామంటూ టెస్ట్ ట్రయల్స్ చేస్తున్నారని అన్నారు. ఒక ఆర్టిస్ట్‌ను హీరోగా పెట్టుకోవాలంటే స్క్రీన్ టెస్ట్ చేసినట్లుగా పవన్ కల్యాణ్‌ను అలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీయా, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరో ఒకరు ఎంగేజ్ చేసుకున్నారని వాస్తవమని అన్నారు. 2009, 2014 ఎన్నికల్లో తిరిగినా జనాలు వస్తారని, తమ తెలంగాణ జనాలు సినిమా నటుడిగా గౌరవిస్తే ఈలలు కొడితే అదంతా బలం అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు.
ఇదంతా ఏంటీ?
ఆంధ్రాలోనే గెలవలేకపోయినవు ఇక్కడకు వచ్చి ఏందీ ఇదంతా అని అన్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణ రావడానికి, పోవడానికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఆవిర్భావం రోజునే గెలికి నవనిర్మాణం పెడతామంటే చూస్తూ ఊరుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని పొన్నం వ్యాఖ్యానించారు. తెలంగాణ మా అయ్య జాగీరే.. నీ అయ్య జాగీరు కాదని స్పష్టంగా చెప్పడానికి తాము వచ్చామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడిందని అన్నారు. ఈ తెలంగాణ ఏపీ ప్రజలకు ఎప్పుడూ స్వాగతం చెబుతుందని, వ్యతిరేకం కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పడానికే ఈ వ్యాఖ్యలని, ఆఖరికి పవన్ కల్యాణ్ అంబేద్కర్ విగ్రహాల గురించి ప్రస్తావన తెచ్చే ధైర్యం చేస్తున్నారని, ఇది అహంకారమని వ్యాఖ్యానించారు.
గద్దర్‌కు క్షమాపణలు చెప్పాలి..
తెలంగాణలో తిరుగుతానంటే ఎవరు వద్దన్నారని, సినిమా నటుడిగా తిరగవచ్చని మంత్రి పొన్నం అన్నారు. ఇవాళ మాట్లాడిన మాటలు మళ్లీ చేయొద్దని, వెంటనే గద్దర్ ఆత్మకు శాంతి కలిగేలా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆంధ్రవారికి పని లేదని ఎప్పుడూ అనలేదని, ఇది ఫెడరల్ సిస్టమ్ అని, హైదరాబాద్‌లో అన్ని భాషల వారు ఉన్నారని తెలిపారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని, భద్రత కల్పిస్తామని, ఇక్కడికి వచ్చి గెలకవద్దని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని పవన్ కల్యాణ్‌కు సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!
ఆగస్టు 26, 2026

Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..
ఆగస్టు 25, 2026

TTD | బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్..!
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Bus Accident | ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం
- ●Amrit Bharat Express | కాగజ్‌నగర్, ఖమ్మం మీదుగా కోయంబత్తూర్ - ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
- ●పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!
- ●Horoscope | ఆగస్టు 26 రాశిఫలాలు.. ఈ రాశివారు విశ్లేషణాత్మక శక్తితో వాటిని అధిగమిస్తారు!
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

Bus Accident | ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం

Amrit Bharat Express | కాగజ్‌నగర్, ఖమ్మం మీదుగా కోయంబత్తూర్ - ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!

Horoscope | ఆగస్టు 26 రాశిఫలాలు.. ఈ రాశివారు విశ్లేషణాత్మక శక్తితో వాటిని అధిగమిస్తారు!



