త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu poetry in Nepal | ఖాట్మండు గడ్డపై తెలుగు పద్యాల మోత: నేపాల్‌లో చరిత్ర సృష్టించిన అరుదైన కవి సమ్మేళనం

దేశ సరిహద్దులు దాటి నేపాల్‌ రాజధాని ఖాట్మండులో తెలుగు కవులు సత్తా చాటారు. వందమందికి పైగా తెలుగు వారితో జరిగిన ఈ కవి సమ్మేళనం విశేషాలు మీకోసం.

J

Telangana | Published On May 6, 2026, 8.57 pm IST

Telugu poetry in Nepal | ఖాట్మండు గడ్డపై తెలుగు పద్యాల మోత: నేపాల్‌లో చరిత్ర సృష్టించిన అరుదైన కవి సమ్మేళనం
Advertisement

Telugu poetry in Nepal | త్రినేత్ర.న్యూస్ : తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి.. పొరుగు దేశం నేపాల్‌లో మన మాతృభాష కవితలు మార్మోగాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు (Kathmandu) వేదికగా నిర్వహించిన 'ఇండో-నేపాల్ కవి సమ్మేళనం' ఒక అరుదైన సాహిత్య ఈవెంట్‌గా చరిత్రలో నిలిచిపోయింది.

ఖాట్మండులోని ప్రసిద్ధ 'క్రిస్టల్ పశుపతి హోటల్' (Crystal Pashupati Hotel) ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. సుమారు వంద మందికి పైగా తెలుగు వాళ్లు ఈ కార్యక్రమానికి హాజరుకాగా, 20 మందికి పైగా ప్రముఖ కవులు తమ కవితా గానంతో అందరినీ ఆకట్టుకున్నారు.

టూర్ లో భాగమైన ఒక అద్భుత ఘట్టం

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి (IAS Officer) జీవీ శ్యాం ప్రసాద్ లాల్ తన మిత్ర బృందంతో కలిసి ఏకంగా 135 మంది తెలుగు వారితో ఒక ప్రత్యేక నేపాల్ యాత్రను ప్లాన్ చేశారు. కేవలం ట్రిప్ లాగా మాత్రమే కాకుండా, ఈ యాత్రలో భాగంగా ఒక కవి సమ్మేళనాన్ని ప్లాన్ చేయడం అందరినీ ఆకర్షించింది. టూరిజం చరిత్రలో కూడా ఇదొక అరుదైన ప్రయోగం అని చెప్పొచ్చు.

కవితలతో అలరించిన ప్రముఖులు

ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ (Professor) ఎస్. రఘు ఈ సమ్మేళనానికి అధ్యక్షత వహించారు. ఐఏఎస్ అధికారి జీవీ శ్యాం ప్రసాద్ లాల్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ ఈవెంట్‌ను.. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. "తెలుగు సాహిత్యం విశ్వజనీనమైనది. ఇలాంటి యాత్రల వల్ల సాహిత్యకారులకు ప్రపంచం పట్ల అవగాహన, జ్ఞానం విస్తృతం అవుతాయి" అని స్పష్టం చేశారు.

ఈ స్పెషల్ ఈవెంట్‌లో బుర్ల వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్, పల్లి సుజాత, మాడిశెట్టి గోపాల్, రావికంటి శ్రీనివాస్, స్థంబంకాడి గంగాధర్, సివి శ్రీనివాస్, డాక్టర్ కూరెళ్ళ పద్మాచారి, కృష్ణ గోపాల్, ముత్తినేని శ్రీనివాసరావు, డాక్టర్ దాసోజు జ్ఞానేశ్వర్, సంపత్, అశోక్, జ్యోతి, గోనె శ్రీనివాస్, ప్రేమలతా తదితరులు యాత్రల నేపథ్యంగా అద్భుతమైన కవితలు వినిపించారు. మల్లికార్జున్ దేవ్, నల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్న ఈ మొత్తం కార్యక్రమానికి మాడిశెట్టి గోపాల్ కో-ఆర్డినేటర్ (Coordinator) గా వ్యవహరించారు.

Advertisement
Advertisement