Indian Navy | సముద్రంలో నేవీ సింహగర్జన!
Indian Navy | సముద్రంలో భారత నౌకాదళం శక్తి మరింత పెరగనుంది. శత్రు నౌకలు, సుదూర సముద్ర–భూ లక్ష్యాలను సూపర్‌సోనిక్ వేగంతో ఛేదించే బ్రహ్మోస్ వ్యవస్థతో నేవీ మరింత పటిష్టం కానుంది. బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, లాంచర్ల కొనుగోలుకు రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రూ.661.50 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.
- మరిన్ని నౌలకు బ్రహ్మోస్ బలం
- రూ.661.50 కోట్లతో నేవీ కీలక డీల్
- ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, లాంచర్ల కోసం రక్షణ శాఖ ఒప్పందం
Indian Navy | సముద్ర జలాల్లో భారత నౌకాదళం దాడి సామర్థ్యం మరింత పెరగనుంది. ఇప్పటికే పలు యుద్ధనౌకల్లో కీలక ఆయుధ వ్యవస్థగా ఉన్న బ్రహ్మోస్‌కు సంబంధించిన ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, లాంచర్ల కొనుగోలుకు కేంద్ర రక్షణ శాఖ రూ.661.50 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరిగింది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. తాజా డీల్‌తో మరిన్ని నేవీ నౌకల్లో బ్రహ్మోస్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం కానుంది.
68 శాతం స్వదేశీ వాటా
‘బై ఇండియన్–ఇండిజినస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్’ కేటగిరీలో ఈ కొనుగోలు చేపట్టనున్నారు. ప్రాజెక్టులో కనీసం 68 శాతం స్వదేశీ పదార్థాలను వినియోగించనున్నారు. దీనివల్ల దేశీయ రక్షణ పరిశ్రమకు ఊతం లభించడంతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) అవకాశాలు పెరగనున్నాయి. ఈ ప్రాజెక్టు అమలుతో వచ్చే మూడేళ్లలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని రక్షణ శాఖ తెలిపింది. బ్రహ్మోస్ ఇప్పటికే భారత నౌకాదళానికి చెందిన పలు ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకల్లో సేవలందిస్తోంది. సముద్రం నుంచి భూమిపై, సముద్రంలోని లక్ష్యాలను ఛేదించగల ఉపరితలం–ఉపరితల క్షిపణి వ్యవస్థగా ఇది నేవీకి కీలక ఆయుధంగా ఉంది. సూపర్‌సోనిక్ వేగంతో సుదూర లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. తాజా ఒప్పందం ద్వారా సముద్ర భద్రత, నౌకాదళ పోరాట సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఎగుమతుల్లోనూ దూకుడు
స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో బ్రహ్మోస్ కీలక స్థానాన్ని సంపాదిస్తోంది. ఆగ్నేయాసియాలోని ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియాలకు ఈ క్షిపణి వ్యవస్థను విక్రయించే దిశగా ఒప్పందాలు, కాంట్రాక్టులు ఉన్నాయని రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ ఇటీవల వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌కు ఇప్పటికే సుమారు 330 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ వ్యవస్థలను అందించినట్లు తెలిపారు. వియత్నాంకు ప్రారంభ ఎగుమతుల విలువ సుమారు 100 మిలియన్ డాలర్లు, ఇండోనేషియాకు సుమారు 200 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని పేర్కొన్నారు. మొత్తంగా బ్రహ్మోస్ ఎగుమతులు 600 మిలియన్ డాలర్లను మించనున్నాయని వెల్లడించారు.
సుఖోయ్‌లోనూ బ్రహ్మోస్
నేవీ యుద్ధనౌకలకే పరిమితం కాకుండా బ్రహ్మోస్ ఎయిర్‌బోర్న్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ క్షిపణిని సుఖోయ్ యుద్ధ విమానాల నుంచి విజయవంతంగా ప్రయోగిస్తున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి తెలిపారు. సంప్రదాయ వార్‌హెడ్, అధునాతన గైడెన్స్ వ్యవస్థతో కూడిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ వేగంతో సుదూర లక్ష్యాలను ఛేదించగలదు. దేశీయంగా అభివృద్ధి చేసిన అధునాతన రక్షణ సాంకేతికతకు బ్రహ్మోస్ ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Manne Krishank | మన్నె క్రిశాంక్‌కు షరతులు లేకుండా బెయిల్
- ●GST 2.0 Reforms | జీఎస్టీ 2.0 : ఏడాదికి ఒక్కసారే పన్నుల మార్పు.. వ్యాపారులకు ఇక మరింత ఊరట
- ●DMK | రాహుల్ జీ.. తమిళనాడులో ఓట్ల తొలగింపుపై మీ వైఖరేంటి..? : డీఎంకే
- ●Facebook | ఫేస్బుక్లో భారీ మార్పు.. ఇక ఓపెన్ చేస్తే రీల్సే..
- ●Sumithranand | నిజమేదో అబద్దమేదో రేవంతే మీడియా ముందు చెప్పాలి
- ●Union Cabinet | రవాణా రంగానికి ‘ఇంటిగ్రేటెడ్’ బూస్ట్

Manne Krishank | మన్నె క్రిశాంక్‌కు షరతులు లేకుండా బెయిల్

GST 2.0 Reforms | జీఎస్టీ 2.0 : ఏడాదికి ఒక్కసారే పన్నుల మార్పు.. వ్యాపారులకు ఇక మరింత ఊరట

DMK | రాహుల్ జీ.. తమిళనాడులో ఓట్ల తొలగింపుపై మీ వైఖరేంటి..? : డీఎంకే

Facebook | ఫేస్బుక్లో భారీ మార్పు.. ఇక ఓపెన్ చేస్తే రీల్సే..






