Google Health Guardian | గూగుల్ నుంచి హెల్త్ గార్డియన్.. ఆరోగ్యంపై 24 గంటల నిఘా..
Google Health Guardian | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ హెల్త్ గార్డియన్ పేరుతో కొత్త ఆరోగ్య, భద్రతా ఫీచర్ల సముదాయాన్ని ప్రకటించింది. అర్హత కలిగిన పిక్సల్ వాచ్‌లు, ఫిట్‌బిట్ ఎయిర్ పరికరాల కోసం త్వరలో గూగుల్ హెల్త్ యాప్‌లో ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి వినియోగదారుల శరీరంలో చోటుచేసుకునే సూక్ష్మమైన శారీరక మార్పులను 24 గంటలూ గమనిస్తాయి.
Technology | Published On Aug 15, 2026, 1.53 pm IST
Google Health Guardian | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ హెల్త్ గార్డియన్ పేరుతో కొత్త ఆరోగ్య, భద్రతా ఫీచర్ల సముదాయాన్ని ప్రకటించింది. అర్హత కలిగిన పిక్సల్ వాచ్‌లు, ఫిట్‌బిట్ ఎయిర్ పరికరాల కోసం త్వరలో గూగుల్ హెల్త్ యాప్‌లో ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి వినియోగదారుల శరీరంలో చోటుచేసుకునే సూక్ష్మమైన శారీరక మార్పులను 24 గంటలూ గమనిస్తాయి. ప్రతి నెలా ముఖ్యమైన మార్పులను తెలియజేస్తూ సారాంశాలను అందిస్తాయి. ఏదైనా మార్పు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన స్థాయిలో ఉన్నట్లు గుర్తిస్తే, వెంటనే నోటిఫికేషన్‌ను కూడా పంపిస్తాయి. ఈ సమాచారాన్ని వినియోగదారులు సులభంగా అర్థం చేసుకునేందుకు గూగుల్ హెల్త్ కోచ్ సహాయపడుతుంది. సేకరించిన ఆరోగ్య సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే విషయాలుగా మార్చడంతో పాటు, జీవనశైలిలో ఎలాంటి ఆచరణాత్మక మార్పులు చేసుకోవచ్చో సూచనలు అందిస్తుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్, బ్లడ్ ప్రెజర్ ట్రెండ్స్..
హెల్త్ గార్డియన్‌లో నాలుగు ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. మొదటిది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రెండ్స్. ఇది రక్త నమూనా అవసరం లేకుండానే పలు వారాల శారీరక సమాచారాన్ని విశ్లేషించి, శరీర జీవక్రియ ఆరోగ్యంలో వస్తున్న మార్పులను గుర్తిస్తుంది. సుమారు 40 శాతం మంది పెద్దలకు తమ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో మార్పులు జరుగుతున్న విషయం తెలియదని గూగుల్ చెబుతోంది. ఈ ఫీచర్ ద్వారా మార్పులను గుర్తించి ఆహారం, నిద్ర, శారీరక కదలికల్లో అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోది బ్లడ్ ప్రెజర్ ట్రెండ్స్. ఇది కఫ్ లేదా మాన్యువల్ క్యాలిబ్రేషన్ అవసరం లేకుండా, నెలంతా సేకరించిన గుండె స్పందన, శారీరక కదలికల నమూనాలను ఉపయోగించి రక్తపోటు మార్పులను అంచనా వేస్తుంది. ప్రతి 10 మందిలో ఆరుగురికి తమ రక్తపోటు పెరిగిన విషయం తెలియదని గూగుల్ పేర్కొంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న రక్తపోటు మార్పులు గుండె, మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గుర్తించిన ధోరణులను ఇంట్లో ఉపయోగించే రక్తపోటు పరికరంతో నిర్ధారించుకోవాలని లేదా వైద్య నిపుణులను సంప్రదించాలని గూగుల్ సూచించింది.
స్లీప్ బ్రీతింగ్ ట్రెండ్స్..
మూడోది స్లీప్ బ్రీతింగ్ క్వాలిటీ ట్రెండ్స్. నిద్ర సమయంలో శ్వాసలో వచ్చే మార్పులను ఇది గమనిస్తుంది. ప్రతి ఉదయం వినియోగదారుడి నిద్రలో ఎంత సమయం సరైన శ్వాస స్థితిలో గడిచిందో చూపిస్తుంది. నెలవారీ అంచనా ద్వారా దీర్ఘకాలికంగా ఏర్పడుతున్న శ్వాస సంబంధిత నమూనాలను గుర్తించవచ్చు. దీని ఆధారంగా నిద్రించే పరిసరాల్లో, రోజువారీ అలవాట్లలో మార్పులు చేసుకోవచ్చు. అవసరమైతే వైద్య నిపుణులతో చర్చించేందుకు కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది. నాలుగోది బ్రీతింగ్ ఎమర్జెన్సీ డిటెక్షన్. ఇది ఎంపిక చేసిన యూరప్ దేశాల్లో అందుబాటులో ఉండే పిక్సల్ వాచ్ ఫీచర్. రక్తంలో ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా తగ్గినప్పుడు ఇది గుర్తిస్తుంది. తీవ్రమైన న్యూమోనియా, ప్రమాదవశాత్తూ ఔషధాల అధిక మోతాదు తీసుకోవడం, ఊపిరాడకుండా పోవడం వంటి శ్వాస సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ సంతృప్తత నిరంతరం ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. వాచ్ ధరించిన వ్యక్తి స్పందించకపోతే, ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా అత్యవసర సేవలకు, అందుబాటులో ఉన్న సందర్భాల్లో అత్యవసర పరిచయ వ్యక్తులకు కాల్ చేస్తుంది.

ఏఐ మోడల్స్‌కు శిక్షణ..
హెల్త్ గార్డియన్ వెనుక ఉన్న కృత్రిమ మేధస్సు నమూనాలను అభివృద్ధి చేయడానికి గూగుల్ కోట్లాది మంది స్వచ్ఛందంగా పాల్గొన్న వినియోగదారుల సెన్సార్ సమాచారాన్ని, రోజువారీ జీవితానికి సంబంధించిన బిలియన్ల నిమిషాల డేటాను ఉపయోగించింది. సెన్సార్ సమాచారం కొంత మిస్ అయినా లేదా అసంపూర్ణంగా ఉన్నా మానవ శరీరంలోని నమూనాలను గుర్తించేలా ఈ నమూనాలను రూపొందించినట్లు గూగుల్ తెలిపింది. హెల్త్ గార్డియన్‌లోని ప్రతి ఫీచర్‌ను క్లినికల్ వాలిడేషన్‌కు గురిచేసినట్లు గూగుల్ పేర్కొంది. ఇందుకోసం గోల్డ్-డర్డ్ వైద్య పరికరాలు, కొలత విధానాలను ఉపయోగించడంతోపాటు శాస్త్రీయ సమాజం నుంచి అభిప్రాయాలను తీసుకుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రెండ్స్ కోసం ఉపయోగించే సెన్సార్ ఫౌండేషనల్ మోడల్‌ను 50 లక్షల మంది స్వచ్ఛంద వినియోగదారుల నుంచి సేకరించిన ఒక ట్రిలియన్ నిమిషాలకు పైగా డేటాతో ముందస్తుగా శిక్షణ ఇచ్చారు. సాధారణ క్లినికల్ రక్త పరీక్షలతో ఈ నమూనా కచ్చితత్వాన్ని ధ్రువీకరించినట్లు గూగుల్ తెలిపింది. దీనికి సంబంధించిన పరిశోధనా కథనం నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది.
బిలియన్ల నిమిషాల డేటాతో ట్రెయినింగ్..
బ్లడ్ ప్రెజర్ ట్రెండ్స్ కోసం వేవ్స్‌ఎఫ్‌ఎం అనే ఫౌండేషన్ మోడల్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది బిలియన్ల నిమిషాల గుండె స్పందన, కదలికల సమాచారంతో శిక్షణ పొందింది. విభిన్న వ్యక్తుల నుంచి సేకరించిన డేటాతోపాటు ఫిట్‌బిట్ హైపర్‌టెన్షన్ ల్యాబ్స్ అధ్యయనం ద్వారా ఈ డేటాను ధ్రువీకరించినట్లు గూగుల్ పేర్కొంది. హెల్త్ గార్డియన్ ద్వారా లభించే సమాచారం గూగుల్ హెల్త్ యాప్‌లో నెలవారీ సారాంశాల రూపంలో అందుతుంది. ముఖ్యమైన మార్పులను ఇందులో ప్రత్యేకంగా చూపిస్తారు. ఏదైనా ఫీచర్ శ్రద్ధ వహించాల్సిన మార్పును గుర్తించినప్పుడు, వినియోగదారులకు సమయానుకూలంగా నోటిఫికేషన్లు కూడా అందుతాయి.
ఎప్పుడు వస్తుంది..
గూగుల్ హెల్త్ కోచ్ ఈ సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఆరోగ్యం, వెల్‌నెస్‌కు సంబంధించిన ఆచరణాత్మక జీవనశైలి మార్పులపై మార్గదర్శకత్వం అందిస్తుంది. హెల్త్ గార్డియన్ ఫీచర్లు అర్హత కలిగిన పిక్సల్ వాచ్‌లు, ఫిట్‌బిట్ ఎయిర్ పరికరాల కోసం గూగుల్ హెల్త్ యాప్‌లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అయితే బ్రీతింగ్ ఎమర్జెన్సీ డిటెక్షన్ ఫీచర్ మాత్రం ఎంపిక చేసిన యూరప్ దేశాల్లోని పిక్సల్ వాచ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
- ●Abhijeet Dipke | స్వాతంత్య్ర దినోత్సవం రోజున మా గొంతు అణచివేసే ప్రయత్నం : సీజేపీ
- ●PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటనలు
- ●Ramchandar Rao | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు
- ●Mahindra Scorpio Lifestyler | మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్.. హైలక్స్కు గట్టి పోటీ..
- ●SairaBhanu | హిందూ ... ముస్లిం ప్రేమకథ - ఆది సాయికుమార్ సైరాభాను ఫస్ట్ లుక్ వచ్చేసింది!
- ●KTR | రేవంత్ లాంటి తెలంగాణ వ్యతిరేకులు గద్దెనెక్కితే.. రాష్ట్రాభివృద్ధిపై ప్రేమ ఎలా ఉంటుంది?: కేటీఆర్

Abhijeet Dipke | స్వాతంత్య్ర దినోత్సవం రోజున మా గొంతు అణచివేసే ప్రయత్నం : సీజేపీ

PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటనలు

Ramchandar Rao | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు

Mahindra Scorpio Lifestyler | మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్.. హైలక్స్కు గట్టి పోటీ..



