Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం
Ponnam Prabhakar | స్వాతంత్య్రం అంటే విదేశీ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, విద్య, ఉపాధి, అభివృద్ధి అందేలా సమాజాన్ని నిర్మించడమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం 80వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.
- మహిళా సంఘాలకు 9.25 కోట్ల రూపాయల చెక్కును అందించాం
- ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో సత్కరించాం
- సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: స్వాతంత్య్రం అంటే విదేశీ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, విద్య, ఉపాధి, అభివృద్ధి అందేలా సమాజాన్ని నిర్మించడమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం 80వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మెప్మా ఆధ్వర్యంలో 64 మహిళా సంఘాలకు 9.25 కోట్ల రూపాయల చెక్కును అందించినట్లు పేర్కొన్నారు. 821 ఎస్‌హెచ్‌జీలకు 78 కోట్ల రూపాయల చెక్కును, జిలాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసినట్లు తెలిపారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పెరేడ్‌ను పర్యవేక్షించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించి, వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించాను. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, అహింసా మార్గంలో సాగిన ఉద్యమాల ఫలితంగానే స్వాతంత్య్రం సిద్ధించింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ,వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంది. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, యువతకు ఉపాధి అవకాశాలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వం, సామాజిక ఐక్యతను కాపాడుతూ అభివృద్ధి చెందిన, సమానత్వంతో కూడిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యంగా కలిసి ముందుకు సాగుదాం అని పొన్నం పిలుపునిచ్చారు.


ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు
ఆగస్టు 15, 2026

KTR | రేవంత్ లాంటి తెలంగాణ వ్యతిరేకులు గద్దెనెక్కితే.. రాష్ట్రాభివృద్ధిపై ప్రేమ ఎలా ఉంటుంది?: కేటీఆర్
ఆగస్టు 15, 2026

Revanth Reddy | రాష్ట్ర నీటిహక్కుల విషయంలో రాజీపడేది లేదు: సీఎం రేవంత్
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●Abhijeet Dipke | స్వాతంత్య్ర దినోత్సవం రోజున మా గొంతు అణచివేసే ప్రయత్నం : సీజేపీ
- ●PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటనలు
- ●Ramchandar Rao | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు
- ●Mahindra Scorpio Lifestyler | మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్.. హైలక్స్కు గట్టి పోటీ..
- ●SairaBhanu | హిందూ ... ముస్లిం ప్రేమకథ - ఆది సాయికుమార్ సైరాభాను ఫస్ట్ లుక్ వచ్చేసింది!
- ●KTR | రేవంత్ లాంటి తెలంగాణ వ్యతిరేకులు గద్దెనెక్కితే.. రాష్ట్రాభివృద్ధిపై ప్రేమ ఎలా ఉంటుంది?: కేటీఆర్

Abhijeet Dipke | స్వాతంత్య్ర దినోత్సవం రోజున మా గొంతు అణచివేసే ప్రయత్నం : సీజేపీ

PM Modi | కోటి మందికి AI శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్.. ప్రధాని మోదీ కీలక ప్రకటనలు

Ramchandar Rao | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాం.. రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తున్నరు

Mahindra Scorpio Lifestyler | మహీంద్రా కొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్.. హైలక్స్కు గట్టి పోటీ..



